కివీస్‌తో మ్యాచ్‌కూ క్లార్క్ దూరం
బర్మింగ్‌హామ్, జూన్ 11
(జనంసాక్షి) :
ఛాంపియన్స్ ట్రోఫీని పరాజయంతో ఆరంభించిన ఆస్టేల్రియాకు జట్టును ఇంకా గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కెప్టెన్ మైకేల్‌క్లార్క్ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. గాయం కారణంగా ఇంగ్లాండ్‌పై ఆడని క్లార్క్ పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో రెండో మ్యాచ్‌కు కూడా అతని సేవలు కోల్పోనుంది. క్లార్క్ వెన్నునొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. నొప్పి తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో లేకపోవడం మైనస్‌గా మారింది. ప్రస్తుతానికి క్లార్క్ ఫిట్‌నెస్ పరీక్షిస్తున్నామని , బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఎటువంటి రిస్క్ తీసుకోలేమని ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో కీలకమైన న్యూజిలాండ్ మ్యాచ్‌కు క్లార్క్ లేకపోవడం ఆస్టేల్రియాకు మైనస్‌గా భావిస్తున్నారు. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోవడంతో… రెండో మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిస్తేనే సెవిూస్ రేసులో ఉంటుంది. ఓడితే మాత్రం సెవిూఫైనల్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్టు. ఆస్టేల్రియా తన చివరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. కాగా క్లార్క్ లేకపోవడంతో జార్జ్ బెయిలీ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.