మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం ప్రకటించాలి
` నిధులెందుకు ఇవ్వడం లేదు?
` కేంద్రాన్ని నిలదీసిన సీఎం రేవంత్
` కుంభమేలా చేసుకున్న పుణ్యమేంది?
` మేడారం చేసుకున్న పాపమేంది?
` ఆదివాసీ జాతరకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే
` మేడారం సందర్శన..అభివృద్ధి పనులపై సమీక్ష
` జాతరలోగా పనుల పూర్తిచేయాలని ఆదేశాలు
` అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు
` నిలువెత్తు బంగారం సమర్పించిన ముఖ్యమంత్రి
ములుగు(జనంసాక్షి):ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కుంభమేళాకు రూ.వేల కోట్లు ఇస్తున్న కేంద్రం.. ఆదివాసుల కుంభమేళా ’మేడారం జాతర’కు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఈ జాతరకు జాతీయ హోదా గుర్తింపు ఇవ్వాలని, ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సవిూక్షించారు. అనంతరం ఏర్పాటు-చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆలయ అభివృద్ధి బాధ్యతతో కూడిన భావోద్వేగమని పేర్కొన్నారు. ఈ పనులతో మంత్రి సీతక్కతోపాటు- తన జన్మ ధన్యమైనట్లేనన్నారు. సమ్మక్క- సారలమ్మ ఆశీస్సులతో 2023 ఫిబ్రవరి 6న ఇక్కడినుంచే పాదయాత్ర మొదలు పెట్టా. తెలంగాణకు పట్టిన చీడపీడలను వదిలించేందుకు ఈ గడ్డపై నుంచి అడుగులు వేశాం. ఆనాడు పాలకులు సమ్మక్క -సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. కానీ, మా ప్రభుత్వం ఎన్ని రూ.కోట్లయినా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆదివాసులను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఇందులో భాగస్వాములను చేస్తున్నాం అని అన్నారు. సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. స్థానికుల అభిప్రాయాలు తెలుసుకొనేందుకే ఇక్కడికి వచ్చానని వివరించారు. 100 రోజుల్లో పనులు పూర్తయ్యేలా అధికారులు చూడాలి. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండేలా డిజైన్లు రూపొందించాం. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా నిర్మాణాల రూపకల్పన చేశాం. జంపన్నవాగులో నీరు నిల్వ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. రాబోయే వంద రోజుల్లో నిష్ఠతో పనులు పూర్తి చేయాలి. రాతి కట్టడాలే నిర్మిస్తాం. మహా జాతర నాటికి పనులు పూర్తి చేస్తాం. స్థానికుల భాగస్వామ్యం, సహకారంతోనే ఇది సాధ్యం. మహా జాతరకు మళ్లీ వస్తా. ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు మేడారం ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సవిూక్షా సమావేశంలో భాగంగా పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సీఎం రేవంత్ తెలుసుకున్నారు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు. ఆ అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిరది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వనదేవతలను సందర్శిస్తున్నా. ప్రకృతి వైపరీత్యాలనూ తట్టు-కునేలా శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే మా అభిమతం. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్‌లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు- స్పష్టం చేశారు. ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి సంప్రదాయాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని.. వారి సంప్రదాయంలో ఏమాత్రం మార్పు రాకుండా చూస్తామని హావిూ ఇచ్చారు. ఆలయ అభివృద్ధిని డబ్బులతో కాకుండా భక్తితో చూడాలని, ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా పనులు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని, పనులను పూర్తి చేసే బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.ఇంకా ఆలయ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు- చేయాలని కూడా సూచించారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్ని-కై-నప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటున్నానని అమ్మవార్ల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిరదని పేర్కొన్నారు. ఆదివాసీల పోరాటానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని కొనియాడారు. ఆదివాసీలు దేశానికి మూలవాసులని పేర్కొంటూ, వారి సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఏ సంక్షేమ పథకం అయినా ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నామని అన్నారు. సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణం మా జీవితంలో గొప్ప ఘట్టం. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధం. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు, పూజారులు, సంప్రదాయ కుటుంబాలందరినీ భాగస్వాములను చేస్తున్నాం అని స్పష్టం చేశారు. మహాజాతరకు ముందే పనులు పూర్తిచేసేలా అధికారులు పగలు, రాత్రి పనిచేయాలని ఆదేశించారు. భక్తితో, సమ్మక్క మాలధారణ చేసినట్లుగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అదే సమయంలో, కేంద్రంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి, కుంభమేళాకు వేలకోట్లు- ఇస్తున్న కేంద్రం, ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు నిధులు ఎందుకు ఇవ్వడంలేదు? జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని, నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం‘ అని స్పష్టం చేశారు. మహాజాతర సమయంలో తిరిగి వచ్చి, ఈ జాతరను మరింత ఘనంగా నిర్వహిస్తామని భక్తులకు హావిూ ఇచ్చారు.చివరగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పూజారులను సత్కరించారు. అలాగే ఆయన నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు.