కేంద్రం మూల్యం చెల్లించుకోకతప్పదు
– ఏపీకిచ్చిన హావిూలను వెంటనే అమలు చేయాలి
– హావిూలు నెరవేరే వరకు ఆందోళన నిర్వహిస్తాం
– విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు
– ఉద్రిక్తంగా మారిన విశాలాంధ్ర మహాసభ ఆందోళన
విజయవాడ, మే24(జనం సాక్షి) : ఏపీకి ఇస్తామన్న హావిూలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అలా చేయకుంటే తమ ఆందోళన ఉదృతం చేస్తామని బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు హెచ్చరించారు. గురువారం రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వడంసహా విభజన హావిూలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ విజయవాడలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్రం తీరుకు నిరసనగా ఆటోనగర్‌లో సభ నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకున్న విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు… సభ ప్రారంభానికి ముందే ఒక్కసారిగా సవిూపంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి బయలు దేరారు. ఐదు వందల మంది కార్యకర్తలు ఒక్కసారిగా ముట్టడికి యత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాల ద్వారాలను మూసివేసి ఆందోళనకారులను అతికష్టం విూద అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి సవిూప పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహానికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హావిూలను వెంటనే నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఏపీ విభజన సమయంలో ప్రత్యేక ¬దాతో పాటు అన్ని విధాల సహకరిస్తామని ప్రతిపక్షంలోని బీజేపీ హావిూ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు అయినా ఇప్పటి వరకు హావిూలు నెరవేర్చక పోగా ఏపీ ప్రజల్లో అనేక అపోహలను సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రం స్పందించి విభజన హావిూలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.