గ్యాస్ సరఫరా చేసేందుకు జైపాల్‌రెడ్డి అంగీకరం
హైదరాబాద్: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారన్న నమ్మకం తనకుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గ్యాస్ ఉత్పత్తి మెరుగుపడిన వెంటనే రాష్ట్రానికి తగినంత గ్యాస్ సరఫరా చేసేందుకు జైపాల్‌రెడ్డి అంగీకారం తెలిపారని శ్రీధర్‌బాబు అన్నారు. నేదునూరు విద్యుత్ కేంద్రానికి తగినంత గ్యాస్ సరఫరా చేయాల్సిందిగా జైపాల్‌రెడ్డికి అనేకమార్లు విజ్ఞప్తిచేసినట్లు మంత్రి చెప్పారు. సాంకేతిక సమస్యలు వచ్చినంతమాత్రాన జైపాల్‌రెడ్డికి తెలంగాణపై మమకారం లేదన్నది అవాస్తవమని ఆయన అభిప్రాయపడ్డారు.