చంద్రబాబును వెన్నాడుతున్న భయం
రమణదీక్షితుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దైన్యం
ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అని కొత్తరాగం
భక్తకోటికి ఎప్పటికైనా బాబు సమాధానం చెప్పుకోవాల్సిందే
తిరుమల,మే19(జనం సాక్షి): తిరుమలకు సంబంధించిన విషయాలను మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడడం ద్వారా సమస్యను మరింత తప్పుదోవ పట్టేంచేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తున్నారని అర్థం అవుతోంది. తిరుమల సమస్యలపై చర్చించకుండా కేవలం తనను అప్రదిష్ట పాలు చేయడానికి రమణదీక్షితులు పనిచేస్తున్నరీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇదో రకంగా స్వామి భక్తులను అవమానించడం తప్ప మరోటి కాదు. సమస్యను లేవనెత్తితే చర్చించే ధైర్యం లేకపోవడం ఆయనకు స్వామి విూదున్న గౌరవం ఏపాటిదో తెలుస్తుంది. దీక్షితులు వెనక ఎవరో ఉండి తనను రాజకీయంగా దెబ్బతీస్తున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు ఎంతగా భయపడిపోతున్నారో అర్థం అవుతోంది. ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల, తిరుపతి దేవస్థానం (టిటిడి) స్వార్థపూరిత రాజకీయాలకు రణక్షేత్రంగా మారడం అవాంఛనీయం. టిటిడి ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్‌నియామకంతో అది పారకాష్టకు చేరింది. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా వ్యవహరించిన రమణదీక్షితులు ఇటీవల చెన్నైలో,తరవాత ఢిల్లీలో పత్రికా విలేకరుల గోష్టి నిర్వహించి టిటిడికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. విమర్శలనూ సంధించారు. తిరుమలలో అవినీతి కైంకర్యాలు, అప్పనంగా దోచుకునే అభరాణాల అమ్యామ్యాలపై ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఎదురుదాడికి దిగడం దారుణం కాక మరోటి కాదు. టిడిపి యంత్రాంగమంతా దీనికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. సుధాకర్ యాదవ్ నియామకం తరవాత అతడిని కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు తప్పువిూద తప్పు చేస్తున్నారు. పదవీవిరమణ నిబంధనను తెరపైకి తీసుకొచ్చి దీక్షితులపై వేటు వేసి, ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించడం స్వామికి ద్రోహం చేయడం తప్ప మరోటి కాదు. చంద్రబాబు కూడా ఈ విషయంలో రాజకీయంగా తనకు ద్రోహం చేస్తున్నారనే రీతిలో స్పందించడం చూస్తుంటే సమస్యను పట్టించకోకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో ఉన్నారని అర్థం అవుతోంది. కర్నాటక పోలింగ్ అనంతరం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తిరుమలలో పర్యటించిన సందర్భంలోనే రమణదీక్షితులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని కథనాలు అల్లి ఇదంతా బిజెపి చేస్తున్న కుట్రగా అభివర్‌ఇంచి మరింత రాజకయీ ప్రయోజనం పొందాలని బాబు చూస్తున్నారని అర్థం అవుతోంది. ఈ వ్యవహారం వెనుక కచ్చితంగా కాషాయ కూటమి కుట్రేదో దాగుందనే సందేహాలకు బలం చేకూర్చేలా ప్రకటను చేయడం చూస్తుంటే బాబుకు భయం ఆవరించిందని అనుకోవాలి. ప్రజాసేవయే పరమావధిగా ఏర్పాటైన టిటిడి పాలక మండలి తర్వాత తర్వాత కాలంలో రాజకీయ నాయకులకు అధ్యాత్మిక విడిదిగా మారిపోయింది. భక్తులు సమర్పించిన కానుకలతో సొంత సేవలు చేసుకుంటున్నారు. ధార్మిక కార్యక్రమాలను పక్కన పెట్టారు. అన్యమత ప్రచారాలు జరుగుతున్నా తేలికగా తీసుకున్నారు. గతంలో తిరుమల సంపదతో పేదలకు అత్యాధునిక వైద్య సేవలు, ఉన్నత విద్యాసముపార్జన
చేసేందుకు వీలుగా విద్యా సంస్థలు నెలకొల్పి మానవ సేవే ప్రధానమని చాటారు. జంతు సంపదను, వృక్ష సంపదను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టి పర్యావరణహితానికీ కృషి సల్పారు. అలాంటి విశిష్టత ఉన్న తిరుమల, తిరుపతి దేవాలయాలు ఇప్పుడు రాజకీయ నేతల స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మారిపోవడం దురదృష్టకరం. గతంలో అర్చకులు, సిబ్బంది సంక్షేమం కోసమంటూ ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్‌ను తర్వాత కాలంలో ఎత్తివేశారు. ఇప్పుడు రమణదీక్షితులుపైనా కక్ష సాధింపులకు దిగారనే అపవాదును అంటకట్టారు. రమణ దీక్షితులు పేర్కొన్నట్లుగా అవకతవకలపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కోటానుకోట్ల సంపదపైనా, బంగారు, వజ్ర తదితర ఆభరణాల నిర్వహణపైనా ప్రభుత్వ జవాబుదారీతనం, పారదర్శకతపై ఎలాంటి చర్యలు తసీఉకున్నారో భక్తకోటికి తెలియచేయాలి. దీనిని పక్కన పెట్టి తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో రమణదీక్షితులు ఎపిసోడ్ కూడా ఉందని సిఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు చెప్పడం ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదు.