చేర్యాలను డివిజన్ ప్రకటించకుంటే ఉద్యమం ఉగ్రరూపమే – జేఏసీ చైర్మన్ డా.పరమేశ్వర్
అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 18 : చరిత్రకంగా, రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద రహదారిపై 2గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్,కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ లు మాట్లాడుతూ.. ఒకప్పుడు తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన చేర్యాల రోజురోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలు చేసి అసెంబ్లీ జనగామ, ఎంపీ భువనగిరి, వ్యవసాయ డివిజన్ గజ్వేల్,
ఏసీపీ, విద్యుత్ హుస్నాబాద్, జిల్లా సిద్ధిపేట లకు విడదీసి చేర్యాల ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని గత ఐదు సంవత్సరాల నుండి జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు వినతి పత్రాలు విన్నపాలు చేసి 56 గ్రామపంచాయతీలు తీర్మానం చేసి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మంత్రి హరీష్ రావులకు అందజేసినప్పటికీ కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ప్రాంతేతరుడు కాబట్టే ఈప్రాంతం మీద సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత బీఆర్ఎస్ నాయకులు అధిష్టానాన్ని ఒప్పించి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. లేదంటే వారి పదవులకు రాజీనామా చేసి డివిజన్ ఉద్యమంలో కలిసి రావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష జేఏసీ నాయకులు పూర్మ ఆగం రెడ్డి, ఉడుముల భాస్కర్ రెడ్డి, చెవిటి లింగం, మల్లిగారి యాదయ్య, కురారం బాలనర్సయ్య, బుట్టి భిక్షపతి, బుట్టి సత్యనారాయణ, దాసరి కళావతి, బొమ్మగాని అంజయ్య గౌడ్, తాడెం ప్రశాంత్, బిజ్జ రాము, తాజ్ అహ్మద్, గద్దల మహేందర్, ఆలేటి యాదగిరి, పబ్బోజు రాములు చారి, చంద శ్రీకాంత్, బండి చంద్రయ్య, సనాది భాస్కర్, ఈరి భూమయ్య, బొడిగె గురవయ్య, మంచాల చిరంజీవులు, కొంగరి వెంకట మావో, ఆవుశర్ల యాదయ్య, పొన్నబోయిన మమత, మిట్టపల్లి నారాయణ రెడ్డి, గూడ రాజిరెడ్డి, వెలుగల రఘువీర్, బియ్య రమేష్, చేటుకురి కమలాకర్, ఇట్టబోయిన చంద్రం, వలబోజు నర్సింహా చారి, రాగుల శ్రీనివాస్ రెడ్డి, కుడిక్యాల బాల్ మోహన్, నంగి కనకయ్య, సుంచు సంజయ్, పుట్ట రాజు, పెంబర్ల కనకయ్య, గుడెపు సుదర్శన్,పుల్లూరి రాజు, గజ్జల సురేందర్, రాళ్లబండి నాగరాజు, బురుగు సత్తయ్య, గోనెపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.