జాతీయ రాజకీయాలపై మరోమారు బాబు దృష్టి
అనివార్యమని భావిస్తున్న టిడిపి నేతలు
అమరావతి,మే21(జనం సాక్షి): ఎపి పరిణామాలు మరోమారు చంద్రబాబునాయుడును దేశ రాజకీయాల వైపు నడిచేలా చేస్తున్నాయి. ఎన్‌డిఎతో తెగదెంపులు చేసుకున్నాక, ఎపి ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుతున్న చంద్రబాబు ఇటీవల నేరుగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఇటీవల కార్యక్రమం ఏదైనా అటుతిప్పటి ఇటుతిప్ప దానిని ఎపి విభజన సమస్యలతో ముడిపెడుతున్నారు. అంతేగాకుండా ప్రధాని మోడీ తిరుపతి వేదికగా ఇచ్చిన హావిూలను ప్రస్తావిస్తున్నారు. అందుకే కర్నాటక వ్యవహారంలో కూడా బాబు చురకుగా వ్యవహరించారు. జనతాదళ్‌కు నేరుగా మద్దతు తెలిపారు. బిజెపి రాజకయీఆలను గట్టిగానే తప్పుపట్టారు. బిజెపి హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ప్రధాని మోడీ దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారని నిలదీశారు. ఈ వ్యవహారంలో మమతా బెనర్జీ తదితర నేతలు ఆయనతో మాట్లాడడం ద్వారా మళ్లీ ఆయన జాతీయ రాజకీయాలపై అనివార్యంగానే చర్చించారు. చంద్రబాబు గతంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో మరోమారు జాతీయరాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేపే అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రవేశిస్తే జాతీయ స్థాయి సవిూకరణాలు మరింత వేగంగా మారే అవకాశం ఉందని పార్టీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ లాంటి వాళ్లు అంటున్నారు. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. దీనిని దెబ్బకొట్టలాంటే చంద్రబాబు చురకుగా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలని టిడిపి కోరుకుంటోంది. దక్షిణాదిన అడుగుపెట్టాలన్న ఆరాటంలో కర్ణాటకలో ఆడిన నాటకం బెడిసికొట్టింది. కర్నాటకలో గవర్నర్ ఆదేశాలకు విరుద్ధంగా 24 గంటల వ్యవధిలోనే బలపరీక్ష జరిపి తీరాలని ఆదేశించడంతో బిజెపికి గట్టి షాక్ తగిలింది. బీజేపీకి తగిన
సంఖ్యాబలం లేదనీ, కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి మాత్రమే మెజారిటీ ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా గుర్తించింది. మొత్తంగా వ్యవహారం బిజెపికి శరాఘతాంగా మారింది. ఈ వ్యవహారంతో సంబంధం లేకున్నా చంద్రబాబు చురుకుగా వ్యవహరించారు. బిజెపికి,మోడీకి వ్యతిరేకంగా గటటి విమర్శలు చేశారు. దీంతో మారోమారు బాబు జాతీయరాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు.
——————-