తయారీ రంగానికి భారతే కేంద్రం

5

దక్షిణ కొరియా ప్రధానితో మోదీ కీలక ఒప్పందాలు

సియోల్‌,మే18(జనంసాక్షి): భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు వచ్చిందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్‌ను ప్రపంచానికే తయారీ రంగ కేంద్రంగా మారుస్తామన్నారు. ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు రావాలని ఆకాంక్షించారు. దక్షిణకొరియాలో పర్యటిస్తున్న ఆయన రాజధాని సియోల్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. కొరియా పర్యటన విూతో మాట్లాడటం ద్వారా ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ పటంలో భారత్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్‌ లేకుండా బ్రిక్స్‌ దేశాల కూటమి అసంపూర్తిగా ఉంటుందన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు ఏ దేశానికైనా కీలకమేనని అభిప్రాయపడ్డారు.అంతకుముందు రెండురోజుల పర్యటన నిమిత్తం నరేంద్రమోదీ దక్షిణకొరియా రాజధాని సియోల్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో దక్షిణకొరియా అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తనను చూసేందుకు వచ్చిన భారతీయులతో మోదీ కరచాలనం చేశారు. చైనా, మంగోలియా పర్యటనలు ముగించుకుని సీయోల్‌ చేరుకున్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్‌ అని ప్రధాని మోడీ అన్నారు.భారత్‌ లేకుండా బ్రిక్స్‌ కూటమి అసంపూర్తిగా ఉంటుందన్నారు. ఈ శతాబ్ధం ఆసియాదేనన్నారు. భారత ఆర్థిక ఆధునీకరణలో దక్షిణ కొరియా కీలక భాగస్వామని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఆయనకు సీయోల్‌లో సైనికవందనం ఇచ్చారు. అనంతరం అధ్యక్షురాలు పార్క్‌ గెన్‌ హితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తయారీ సాంకేతిక రంగాల్లో ద.కొరియా అగ్రగామిగా ఉందన్నారు. ఇరుదేశాల జాతీయ భద్రతా మండళ్లు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక్కడి సంస్థల కోసం కొరియా ప్లస్‌ ఛానెల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.