తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
కొడకండ్ల, ఆగస్టు 17(జనం సాక్షి)
భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ సారధ్యంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కొడకండ్ల తహశీల్దార్ కార్యాలయన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు పిట్టగూడులాగున్నాయని తెరాస ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి పేదలను గౌరవంగా బతికేటట్టు చేస్తామని చెప్పినరాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ఇప్పటివరకు కూడా ఇల్లు ఇవ్వడం లేదని, దేశంలో నరేంద్ర మోడీ ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రతి ఏటా రెండు కోట్ల ఇండ్లు నిర్మాణం చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష ఇండ్లు కడుతున్ననంటు కాలం గడుపుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కడుతున్న డబల్ బెడ్ రూం ఇండ్లు లబ్ధిదారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వారిని మోసం చేయడం జరుగుతుందని, నిర్మాణమైన ఇండ్లు పేదలకు పంచకుంట మందు బాబులకు పర్మిట్ రూముల్లాగా, చెడు వ్యసనాలకు అక్కరకొచ్చే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో- కన్వీనర్ కోటేశ్వర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు గుగులోతు లక్ష్మణ్, మండల కార్యదర్శి గుగులోత్ యాకూబ్, బూత్ అధ్యక్షులు ఆంజనేయులు, సురేష్ గౌడ్, ధరావత్ అజయ్ నాయక్, సుధాకర్ నాయక్ తదితరు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.