తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల,మే22(జ‌నం సాక్షి): తిరుమలేశుడి దర్శనం కోసం జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వేసవి సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో ఏడుకొండలపై రద్దీ అధిక స్థాయిలో ఉన్నది. సర్వదర్శనానికి 57 గంటల సమయం పడుతున్నది.  కొండపై గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారాయణగిరి ఉద్యానవనం వద్ద క్యూలైన్లలో భక్తులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు. భోజన, తాగునీటికి సరైన వసతులు అందడంలేదు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నా.. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడం వల్ల సరఫరా ఇబ్బందిగా మారింది. బస్టాండ్‌లోనూ రద్దీ అత్యంత భారీగా ఉంది. సోమవారం రోజున సుమారు 95 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.