తిరుమల వ్యవహారాల్లో ఉదాసీనత సరికాదు
మనకెందుకులే అన్న భావన క్షంతవ్యం కాదు
సామావేదం షణ్ముఖ శర్మ
హైదరాబాద్,మే22(జనం సాక్షి): ప్రభుత్వాలు ఎన్ని మారినా, మనలను ఎలా పరిపాలించినా, అసలైన నాయకుడు తిరుమలలోనున్న శ్రీ వేంకటేశ్వరుడు అనేదే కలౌ వేంకటనాయకః’ అనేదానిలోని అర్థం. గత కొద్దికాలంగా ఆ దివ్యక్షేత్రంలో రాజకీయపరిణామాలు, అన్యమతస్థుల నియామకాలు, వారి చొరబాటు మొదలైన అనేక కారణాల వల్ల ఎందరో భక్తులు వాటిని నిరసించడం, కొన్ని(హిందూ)సంఘాల వారు చర్చలు, వినతి పత్రాలు సమర్పించడం, శాంతియుత ఉద్యమాలు జరిగాయి.. జరుగుతున్నాయి. విూడియా వారు కూడా చర్చాకార్యక్రమాలు పెట్టి రేటింగ్ పెంచుకోవడం జరుగుతోంది. ఇదంతా ప్రజలు చాలామంది చూస్తున్నారు.. కలియుగ వైకుంఠమైన వేంకటాద్రిలో ఇంత దారుణమా? అని అనుకునేవారు కొందరైతే, అన్నిమతాలు ఒక్కటే కదా ఈ హిందూసంఘాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అనేవారు, మనకెందుకులే ఎవరేం చేసినా శ్రీ వేంకటేశ్వరుడు చూసుకుంటాడు అనుకునే ఉదాసీనత కొందరిది. దీనిపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ స్పందించారు. దీనికి మానసికంగా బాధపడుతూ కళ్ళనీరుపెట్టుకునే భక్తులు కూడా లేకపోలెదు. కానీ వారి సంఖ్య అతిస్వల్పం అనడంలో సందేహం లేదు.పరమతస్థులు ఈ దేవస్థానంలో ఉద్యోగస్థులుగా ఉన్నంతమాత్రాన తప్పేముంది? అనే హిందువులు కూడా లేకపోలేదు. దానికి సమాధానం కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే ఎవరికి వారికే లభిస్తుంది.? దేవాలయం అనేది హిందూమతానికి సంబంధించినది. ఒక మతానికి సంబంధించిన దానిని కూడా మతాతీతంగా చూడడం జరగని విషయం..తప్పిదం కూడా.? అన్యమతస్థులు వారు పవితగ్రంథంగా చెప్పుకునే దాని ప్రకారం విగ్రహారాధన శిక్షార్హమైనది. దానిని ఆరాధించేవారు శిక్షార్హులు. కాబట్టి వారెవరికి దైవస్పృహ, అర్చకులపైన గౌరవం ఉండే అవకాశం లేదు సరికదా చులకన భావం కూడా ఉంటుంది.? ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంగా దీనిని పరిగణిస్తూ, ఆదాయం మాత్రమే చూస్తూ అది దేవ ఆదాయమన్న స్పృహ వారికి ఏ మాత్రం ఉండదు.? ఆదాయా వ్యయాలపైన మాత్రమే దృష్టి పెట్టడం వల్ల కాలక్రమేణా శాస్త్ర నిబంధనలను విూరి ప్రసాదాలు మొదలైనవాటిలో కల్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తప్పుజరుగుతోందన్న ఆవేదన కలిగితే, పరిష్కారాలు ఆలోచించవచ్చు…తిరుపతి వెళ్ళేవారికి మన మొక్కుబడులు తీరుస్తున్న ఒకానొక విగ్రహమన్న భావన ఉందా? దైవమనే భావన ఉందో..ఒకసారి ఆలోచించుకోవాలి.? వైకుంఠంలోనున్న స్వామి అక్కడకు వచ్చి ఉన్నది కొలుచుకునేవారి కోసమే కాని తనకోసం కాదు. ఎవరు ఎలా కొలుచుకుంటే వారినలా అనుగ్రహించే స్వామి.? మనకెందుకులే అనే ఉదాసీనత చూపించేవారిని… ‘నాకెందుకులే’ అని ఆ ఏడుకొండలవాడు కూడా ఒక్కసారి అనుకుంటే!!!….? ఏ శుభకార్యం జరగాలన్నా.. ఒక ఉద్యోగం రావాలన్నా.. మంచి సంతానం కలగాలన్నా.. అతనినే నమ్ముకునే వారి గతి? ఎందరిని ఎన్ని విధాల ఆదుకున్నాడో… అదుకుంటున్నాడో.. ఎవరికి వారు కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది. అవసరాలకు మాత్రమేనా దేవుడు? భక్తులమనుకునేవారు ఒక్కసారి ఆలోచించండి. అక్కడకి వెళ్ళి దర్శనం చేసేసుకున్నంత మాత్రాన భక్తి అనిపించుకోదు. మన దర్శనాలు స్వామికి అవసరం లేదు. మనం ఇచ్చే కానుకలు అంతకన్నా అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది..’భక్తి’ అంటే స్వామిపై ‘ప్రేమ’. మనమేం చెయ్యాలి?? వేంకటేశ్వరుడు మనకోసం అక్కడ ఉండి కాపాడుతున్నాడన్న కృతజ్ఞతా భావాన్ని పెంచుకోవాలి.? మనం ప్రార్థిస్తే కోరికలను తీర్చే భగవంతుణ్ణి, ఆలయ వ్యవస్థ మార్చమని సామూహికంగా
వేడుకోవాలి. మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆత్మబంధువైన స్వామి తప్పక నెరవేరుస్తాడు. మనం కనీసం కోరుకోకుండా దేవుడే చూసుకుంటాడులే అనే నిర్లిప్తత మాత్రం తగదు. మన మొక్కుబడులలో కృతజ్ఞతాపూర్వకంగా ఆలయవ్యవస్థలో మార్పుకోసం మొక్కుకోవడం కూడా ఒక భాగం కావాలన్నారు. . వేంకటేశ్వరుడే మన నాయకునిగా గుర్తించి, ఆలయవ్యవస్థలో సానుకూల మార్పు వచ్చిననాడే మనందరికీ రక్ష అని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు.