తీగల వంతన నిర్మాణం మూన్నాళ్ళ ముచ్చటేనా

 

-నెల గడవకముందే వంతెన పై నుండి రాకపోకలు నిలిపివేయడం సిగ్గుచేటు.

-ఎన్నికల్లో లబ్ధి కోసమే గంగుల నాన పాట్లు

-సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
-సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

దేశంలోనే ఎక్కడ లేని విధంగా కరీంనగర్ నగరంలో తీగల వంతెన నిర్మించామని గొప్పలు చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ హడావుడిగా శంకుస్థాపన మున్సిపల్ మంత్రి కేటీ రామారావు తో ప్రారంభించిన తీగల వంతెన రాకపోకలు మాత్రం నిలిపివేసి ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతున్నారని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గుట్టు చప్పుడు కాకుండా కోట్ల రూపాయల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టర్ పనులు చేసిన పట్టించుకోకపోవడం వల్ల కొంత భాగం దెబ్బతిన్నదని నిన్న 15వ ఆగస్టు సందర్భంగా సాంస్కృ తిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ అని పెట్టినటువంటి మంత్రి గంగుల నేడు కూడా రహదారి పూర్తిగా మూసివేయడం దారుణం అన్నారు.బిఆర్ఎస్ నేతలు కరీంనగర్లో ప్రభుత్వ రోడ్లను కూడా వారికి ఇష్టం అయినప్పుడు తెరిపించడం ఇష్టం లేనప్పుడు మూయించడం పట్లప్రజలు అసహ్యించుకుంటున్నారని రానున్న కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పక మానరని వారు ధ్వజమెత్తారు.
నేటికీ తీగల వంతెనపై పోలీస్ పహారా ఏర్పాటు చేసి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎవరిని వెళ్లనివ్వడం లేదు అని భారీ గేట్లు ఏర్పాటు చేశారని ఇది నియంత పాలనకు నిదర్శనమని వారు ఆక్రోషం వ్యక్తం చేశారు.
కరీంనగర్ నగరంలో మంత్రి గంగుల కమలాకర్ తనకు ఇష్టం వచ్చినట్లువ్యవహ రిస్తున్నాడని ప్రజాభిష్టాన్ని కాకుండా తన వ్యక్తిగత ఎజెండానే నగరంలో నడిపిస్తున్నాడని ఇలాంటి పద్ధతి సరికాదని ఇప్పటికైనా కమలాకర్ వ్యక్తిగత ఆలోచనలు మానుకొని ప్రజల అభీష్టం మేరకు పని చేయాలని వారు హితవు పలికారు. టిఆర్ఎస్ నాయకులు కరీంనగర్ నగరంలో కోట్ల రూపాయల పనుల్లో నాణ్యత లేకున్నా నాసిరకం పనులు చేస్తున్న వారిపై చర్య తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అవినీతిపరులకు అండగా ఉంటూ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా నడుస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అయిన చర్య వారు విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం చేసే ఇలాంటి ఎత్తుగడలను ప్రజలు నమ్మరని అన్నారు.
తీగల వంతెన కింది భాగంలో నిర్మించినటువంటి చెక్ డాం నాసిరకంగా నిర్మించడం వల్ల దెబ్బతిన్నదని వారు ఆరోపించారు.నగరంలో నడుస్తున్న పనుల్లో పూర్తిగా నాసిరకం పనులే నడుస్తున్నాయని వీటిని పట్టించుకోవాల్సిన ఇంజనీరింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లు చెల్లిస్తూ ఇంజనీరింగ్ అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని వెంటనే నాసిరకం పనుల నిర్మాణంపై, ఇంజనీరింగ్ అధికారుల అవినీతి,అక్రమాలపై ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి,పైడిపల్లి రాజులు ఒక సంయుక్త ప్రకటనలో హెచ్చరించారు.