తెంగాణలో కొత్త కేసు ఆరే..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(జనంసాక్షి):తెంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఎనిమిది మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌`19 పాజిటివ్‌ కేసు సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసు 514. ఇప్పటివరకు వ్యాధి నుంచి కోుకుని 118 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌`19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మంది మృత్యువాతపడ్డారు. కరోనాపై యుద్ధానికి తెంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని.. ఎంతమంది రోగుకైనా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితు, లాక్‌డౌన్‌ అముపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ఎంతమందికైనా కరోనా పరీక్షు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్‌ నిర్దారిత పరీక్షు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్‌ కిట్స్‌, చికిత్సకు కావాల్సిన సదుపాయాన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు.

తాజావార్తలు