తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్వాయి పాపన్న
సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు: కత్తి ప్రభాకర్ గౌడ్
మానకొండూరు, ఆర్ సి, ఆగస్టు 18 (జనం సాక్షి)
బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో, మానకొండూరు మండల కేంద్రంలో శుక్రవారం సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ బహుజనులను మేల్కొలిపి రాజ్యాధికారకాంక్షను రేకెత్తించి అతి సామాన్య గీతా కార్మిక కుటుంబంలో పుట్టి దాదాపుగా 22 కోటలను వశపరచుకొని గెరిల్లా యుద్దసైన్యంతో గోల్కొండ ను వశపరచుకొని పరిపాలన చేసిన గొప్ప చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని పాపన్న ఘన చరితను కొనియాడారు. సర్వాయి పాపన్న జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని అన్నారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్వాయి పాపన్న అని కితాబు నిచ్చారు. బహుజన సోదరులంతా సగర్వంగా పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
మానకొండూరు మండల ఉపాధ్యక్షులు రావుల తిరుపతి గౌడ్ ,మానకొండూరు మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మడ్డి మల్లేష్ గౌడ్ గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు, కెల్లెడు గ్రామ అధ్యక్షులు బుర్ర అనిల్ గౌడ్, ఉపాధ్యక్షులు రావుల కిషన్ గౌడ్, రావుల అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు బొమ్మ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బొమ్మ సతీష్ గౌడ్, కార్యదర్శి రావుల తిరుపతి గౌడ్, సహాయ కార్యదర్శి ఎరుకొండ చంద్రయ్య గౌడ్, గౌరవ సలహా సలహాదారుడు రావుల రాజు, సహాయ కార్యదర్శి రావుల కనకయ్య గౌడ్, కార్యవర్గ సభ్యులు ఏరుకొండ అన్వేష్ గౌడ్, గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు ఏరుకొండ ప్రశాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు బైరవని అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షులు బైరగోని అనిల్ గౌడ్, ఉపాధ్యక్షులు పూరెల్ల రాములు, రావుల కొమురయ్య, రావుల రాజయ్య, రావుల బుచ్చయ్య, కాటా శ్రీహరి, ఏరుకొండ సంపత్ రావుల సతీష్, రావుల కుమార్, బొమ్మ శ్రీనివాస్, ఏడుకొండ రాజయ్య, ఎర్ర కొండ సాయిలు తదితరులు పాపన్న జయంతి వేడుకలకు హాజరయ్యారు.