నల్లబ్యాడ్జీలతో తిరుమలలో అపచారం: ఎంపి
విజయవాడ,మే24(జనం సాక్షి): టీటీడీ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించడం దురదృష్టకరమని వైసీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. టీటీడీపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారిపై కక్ష సాధింపు సరికాదన్నారు. టీటీడీ బోర్డులో అర్హత లేనివారిని సభ్యులుగా నియమించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌తో కలిసేందుకు చంద్రబాబు చూస్తున్నారని ఎంపీ వరప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే తిరుమల లో ప్రభుత్వం మరో అపచారానికి పాల్పడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగం నుంచి తీసేసిన మాజీ ప్రదాన అర్చకులు రమణ దీక్షితులకు వ్యతిరేకంగా టిటిడి ఉద్యోగులు నల్లబాడ్జీలతో నిరసన చెబుతున్నారు. మూడురోజుల పాటు వారు అలా నిరసన తెలుపుతారట. ఇదంతా ప్రబుత్వం అడిస్తున్న డ్రామాగానే కనిపిస్తోంది. ఒకవేళ ప్రబుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా అలా నల్లబాడ్జీలు ధరిస్తే అందుకు టిటిడి ఒప్పుకుంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. బిజెపి నేతలు భాను ప్రకాష్ రెడ్డి, సినీ నటి కవితలు ఈ పరిణామంపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే గందరగోళంగా మారిన తిరుమలను ఉద్యోగులు నల్లబాడ్జీలతో పరువు తీస్తున్నారని కవిత ద్వజమెత్తారు.ఇదంతా తిరుమలకు అపచారం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఉద్యోగులు నల్లబాడ్జీలతో
దర్శనం ఇవ్వడంపై భక్తులు మండిపడుతున్నారు.