ప్రగతి పథంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు

– గవర్నర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 1,(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ను శుక్రవారం ళ అమెరికా ప్రతినిధుల బృందం కలిసింది. తెలుగు రాష్టాల్ల్రోని అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్‌ నరసింహన్‌ అమెరికా ప్రతినిధులకు వివరించారు. తెలుగు రాష్టాల్రు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. రెండు రాష్టాల్రు నీరు విద్యుత్‌, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. తెలంగాణలో మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ అమలు బాగుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. షీ టీమ్‌ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. దేశంలోనే మొదటిసారిగా రాజ్‌భవన్‌లో పూర్తి సౌరవిద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటైందని గవర్నర్‌ నరసింహన్‌ అమెరికా ప్రతినిధులకు వివరించారు. తెలుగు రాష్టాల్రు వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ ఇచ్చే స్థాయికి చేరాయి. రానున్న ఐదేళ్లలో రెండు రాష్టాల్రు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తాయి. రాజధాని నిర్మాణం పూర్తయితే అమరావతి ప్రపంచస్థాయి నగరంగా ఉంటుందని తెలిపారు.

తాజావార్తలు