ప్రజలపై ధ్యాస లేకుండా అధికారంపై తహతహ

తెలంగాణలో 2019ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమంటూ ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీలు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. అధికారంలో రావడానికి ఏదైనా ప్రాతిపదిక ఉండాలి. ప్రజల్లో ఇమేజ్‌ రావాలి. లేదా గతంలో చేసిన భారీ ప్రయోజనాలు ఏవైనా ఉండాలి. ఈ రెండు పార్టీలకు అలాంటి చరిత్ర ఉన్న దాఖలాలు లేవు. కాంగ్రెస్‌ తీరు గురివింద సామెతను గుర్తు చేస్తోంది. విభజన సమయంలో పారదర్శకత లేకపోవడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్ల్రో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఏ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్న భరోసా లేకుండా పోయింది. హైకోర్టు విభజన తీసుకుంటే ఎంతగా రాజుకుందో తెలియంది కాదు. ఇకపోతే ఎపికి ప్రత్యేక¬దా అంటూ ప్రకటనలు చేస్తోంది. ప్రైవేట్‌ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. నిజానికి విభజన బిల్లులో అన్నీ చేర్చి పక్కాగా విభజన చేసివుంటే ఇలాంటి సమస్యలు వచ్చి వుండేవి కాదు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా బిజెపి,కాంగ్రెస్‌ పార్టీలు 2019 అంటూ తమకు తాము టార్గెట్‌ పెట్టుకుంటూ ప్రకటనలు చేస్తుంటే ప్రజలు వెర్రివాళ్లని వారి ఉద్దేశమా అన్న భావన కలుగుతోంది. నిజానికి గత పదేళ్లలో కాంగ్రెస్‌ ఉమ్మడి ఎపిని సర్వనాశనం చేసంది. అంతేనా అంటే పదేళ్లలో చేయని పనులు ఈ రెండేళ్లలో అక్కడ చంద్రబాబు, ఇక్కడ కెసిఆర్‌ చేయాలని కోరుకుంటోంది. ఇక ఎలాంటి చేయూతను ఇవ్వని బిజెపి ప్రేక్షకపాత్ర పోషిస్తూ తామూ అధికారంలోకి వస్తామని కలలు కంటోంది. ఈరెండు పార్టీలు ఇటీవల జరిగిన తమిళనాడు, కేరళ తదితరరాష్టాల్ల్రో ఏమయ్యిందో గమనించి అడుగులు వేస్తే మంచిది. మాటలకు ఓట్లు రాలవని గుర్తుంచుకుని సాగాలి. అయితే ప్రజల్లో భరోసా కల్పించాలి కనుక, కేడర్‌ను కాపాడుకోవాలి గనుక ఇలాంటి మాటలు చెప్పడం అవసరం. అందుకే ఎవరికి వారే ధీమా వ్యక్తం చేసుకుంటూ ఆయా పార్టీల నేతలు ముందుకు సాగుతున్నారు. అయితే బీజేపీ సారథ్య బాధ్యతలను చేపట్టిన లక్ష్మణ్‌ ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి, రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఉన్నారు. కేందరంలోని మోడీని చూపుతూ మభ్య పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మోడీని ఎంతకాలం ఇలా చూపిస్తామన్న ఆలోచన చేస్తే మంచిది. మరోవైపు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోని ముఖ్య నేతలంతా దిగ్విజయ్‌ ఆదేశాలతో ప్రజల బాట పట్టారు. ఊరూవాడా తిరుగుతూ అదేపనిగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లన్నసాగర్‌, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ తదితర సమస్యలను నెత్తికి ఎత్తుకున్నారు. ఇక పలువురు నేతలు మాత్రం కాంగ్రెస్‌ను వీడి వలసబాట పట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక రాష్టాన్న్రి ఇచ్చి తెలంగాణను తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన కాంగ్రెస్‌,బిజెపి నేతలు అనుసరించిన వ్యూహాత్మక తప్పిదం వల్ల వారికి ఇది లాభించలేదు. దీంతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకే కాంగ్రెస్‌ పరిమితం కావాల్సివచ్చింది. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అది భంగపడక తప్పలేదు. దీనికి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సారథ్యం వహించడమే కారణమంటూ ఆయన నాయకత్వ లోపంతోనే పార్టీ ఘోర పరాజయం పాలయ్యిందని విమర్శలు చేసి ఆయనను తప్పించారు. కానీ పార్టీని మాత్రం బతికించుకోలేక పోతున్నారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు అధికార పార్టీపై బహిరంగ విమర్శలకు దిగడం తప్ప ప్రజలకోసం పోరాటం చేసింది శూన్యం. పొన్నాలను తప్పించి అతని స్థానంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి పార్టీ పగ్గాలను కట్టబెట్టినా పార్టీ మాత్రం బతికి బట్టకట్టడం లేదు. అంతర్గత విబేధాలు కాంగ్రెస్‌ సొత్తు కావడం వల్ల ఉత్తమ్‌ కుమా ర్‌రెడ్డి కూడా పార్టీని ముందుకు నడిపిండంలో సఫీలీకృతులు కాలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏడాదిన్నర పాలనలోపే ఉప ఎన్నికల వేడి మొదలు కావడం, రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికలల్లో కాంగ్రెస్‌ వరుస వైఫల్యాలను పొందడంతో పార్టీలోని అసమ్మతి వర్గం ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు ఎక్కుబెట్టారు. ఈనేపథ్యంలో పరాజయాలకు తోడు పార్టీలోని ముఖ్యనేతలంతా టీఆర్‌ఎస్‌ పార్టీలోకి జారుకోవడంతో మళ్లీ ఉత్తమ్‌ నాయకత్వంపైనా విమర్శలు మొదలయ్యాయి. ఆయన వ్లలనే పార్టీ బతికి బట్టకట్టడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. ఇక బిజెపిలో కిషన్‌ రెడ్డిని మార్చి లక్ష్మణుడిని తెరపైకి తెచ్చినా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఇతోధికంగా తోడ్పడడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమయ్యింది. 2014 సార్వత్రిక ఎన్నికలల్లో కిషన్‌రెడ్డి సార థ్యంలో ఒక్క హైదరాబాద్‌లోనే ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యే స్థానాలను కైవశం చేసుకుంది. ఇదంతా మోడీ హవాలో కొంత మేర విజయం సాధించారే తప్ప మరోటి కాదు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడిచేసరికి బిజెపి పరిస్థితిలో ఏ మాత్రం మార్పురాలేదు. ధరలు పెరగడం, శాంతిభద్రతలు విఫలం కావడం, అనేక సమస్యలకు మోడీ ఇచ్చిన హావిూలు కూడా అమలు కాకపోవడంతో ఆయనపైనా భ్రమలు తొలిగాయి. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకోవడం, అదేసమయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మణ్‌కు బాధ్యతలను కట్టబెట్టడం తెలిసిందే. కాంగ్రెస్‌, బిజెపిల్లో అధ్యక్షులు మారారే తప్ప విధానాల్లో మార్పు రాలేదు. ఆలోచనల్లో మార్పు లేదు. ప్రజలకుసేవచేయడంలోనూ మార్పు రాలేదు. అయినా అధికారం మాత్రం కావాలని ఈ రెండు పార్టీలు తహతహలాడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలలో దాదాపు అరడజను మందికి పైగా ఎమ్మెల్యేలు, అదే సంఖ్యలో ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరినా పార్టీ వైఖరి మారడం లేదు. అధికార టిఆర్‌ఎస్‌పై ఇప్పటికిప్పడు వ్యతిరేకత లేదా అసంతృప్తి లేదు. అలాగే ఎపిలోనూ బాబు బాగానే చేస్తున్నారన్న భావన ఉంది. అదంతా కాంగ్రెస్‌, బిజెపిలో ఉన్నవారికి తప్ప మరోటి కాదు. వారు తమ విధానాలు మార్చుకోకుంటే ఈ మాత్రం కూడా ప్రజల్లో నిలవరని ఈ రెండు పార్టీల నేతలు గుర్తుంచుకోవాలి.