మరోసారి కుంభవృష్టి

` హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
` భారీ వర్షంతో రోడ్లపైనిలిచిన వాననీరు
` పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి): రాజధాని హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్‌ మేఘాలు అలుముకున్నాయి. దీంతో నగరంలో మరోమారు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా.. ఆ తర్వాత అవి జోరువానగా మారాయి. దీంతో ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ట్రాఫిక్‌ చిక్కుల్లో పడ్డారు. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు- అక్కడక్కడా జోరు వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బేగంపేట, సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలతోపాటు- జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్‌ సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా వర్షం పడిరది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మణికొండ, గచ్చీబౌలి, హై-టె-క్‌ సిటీ-, నానక్‌ రామ్‌ గూడలో జోరువాన కురిసింది. రాం నగర్‌, అవిూర్‌పేట్‌, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్‌, మూసాపేట్‌లోనూ వర్షం దంచికొట్టింది. కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, మియాపూర్‌లోనూ ఇదే పరిస్థితి. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు- పడ్డారు. పలు చోట్ల మ్యాన్‌ హోల్స్‌ పొంగిపొర్లాయి. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అవిూర్‌పేట, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, పెద్దఅంబర్‌పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. ఖైరతాబాద్‌-రాజ్‌భవన్‌ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. అవిూర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు- హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడిరచింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈనెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న మయన్మార్‌-దక్షిణ బంగ్లాదేశ్‌ తీర ప్రాంతాల్లోనున్న తమిళనాడును ఆనుకొని ఉన్న దక్షిణ ఆంధప్రదేశ్‌ తీరాల వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోవిూటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ క్రమంలో సోమవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మంగళశారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది.