కాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరాసన!

 

 

 

 

రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )!

ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసిన నీటి నిల్వలే కానీ ఓ గ్రామంలోని మహిళలకు బిందెడు నీళ్లు కరువు.. దీనితో కడుపు మండి గ్రామ మహిళలు రోడ్డుక్కారు. ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
15 రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టించుకునే నాధుడే కరువయ్యారని మహిళలు బిందెలతో ఆందోళనకు దిగారు.
బుధవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….15 రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో దగ్గరలో ఉన్న వ్యవసాయ బావులు, వాడుకలలో లేని చేత బావులు నుండి నీరు తెచ్చుకొని త్రాగడంతో విష జ్వరాలు వస్తున్నాయని, అధికారులకు నాయకులకు పలుమార్లు విన్నవించుకున్న ఎలాంటి స్పందన లేదని,నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారిపై నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి అధికారులు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిందెలను రోడ్డుపై కొట్టి లొల్లి చేశారు. వెంటనే అధికారులు,నాయకులు స్పందించి త్రాగునీరు అందించాలని,లేనిచో గంటల తరబడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.