భజ్జీ లాగాడు :
ఐనా సచిన్ శ్రీనివాస్‌కు దూరంగా
కోల్‌కతా మే 27 (జనంసాక్షి): : బెట్టింగ్ వ్యవహారంలో అల్లుడు గురునాథ్ మేయప్పన్ అరెస్టయి. రాజీనామా చేయాలనే ఒత్తిడిని ఎదుర్కుంటు బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ నుంచి ఐపియల్ ట్రోఫీని అందుకోవడానికి మాస్టర్ బ్లాస్టర్ అయిష్టత వ్యక్తం చేశాడా? ఇదే విషయంపై టీవీ చానెళ్లలో చర్చ జోరుగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో ఐపియల్ మ్యాచులో విజయం సాధించిన తర్వాత శ్రీనివాసన్ ముంబై జట్టుకు ట్రోఫీని అందించారు.
ఈడెన్ గార్డెన్‌లో ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మకు శ్రీనివాసన్ ట్రోఫీని అందించడానికి ముందుకు వచ్చినప్పుడు టెండూల్కర్ దూరంగా ఉండిపోయినట్లు మీడియా పుటేజ్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తోంది. శ్రీనివాసన్‌కు దగ్గరగా నిలుచున్న రోహిత్ శర్మ, రికీ పాంటింగ్‌లను దూరంగా టెండూల్కర్ నిలబడి ఉండడం కనిపించింది.
టెండూల్కర్ దూరంగా ఉండడాన్ని గమనించిన హర్భజన్ సింగ్ దగ్గరకు రావాలని పిలిచాడు. అయితే సచిన్ టెండూల్కర్ ఏదో సమాచారం చెప్పాడు. అయితే హర్భజన్ సచిన్ టెండూల్కర్ చేయి పట్టుకుని రోహిత్ శర్మ, పాంటింగ్‌లకు దగ్గరగా లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో టెండూల్కర్ దగ్గరగా వచ్చాడు. శ్రీనివాసన్ నుంచి రోహిత్, పాటింగ్ ట్రోఫీని అందుకోగానే సచిన్ టెండూల్కర్ మళ్లీ దూరం జరిగాడు.శ్రీనివాసన్‌కు కోల్‌కతా ఈడెన్ గార్డెన్ ప్రేక్షకుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. కావాలనే టెండూల్కర్ శ్రీనివాసన్‌కు దూరంగా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. ఐపియల్‌లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.