భారత సంతతికి చెందిన జర్నలిస్ సస్పెండ్ చేసిన టైమ్ పత్రిక
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్‌ను టైమ్ పత్రిక సస్పెండ్ చేసింది. టైమ్ పత్రిక కాలమిస్ట్‌గా పనిచేస్తూ టైమ్ మేగజైన్‌లో ఆయన రాసిన ‘ద కేన్ గన్ కంట్రోల్’ అనే వ్యాసంలో న్యూయర్క్‌ర్ పత్రికలో మరో రచయిత రాసిన ఒక పేరాగ్రాప్‌ని జకరియా యధాతంగా ఉపయోగించారని, ఆ రచయిత పేరును ప్రస్తావించలేదని ఆరోపణలు వచ్చాయి. జకరియా తన తప్పు అంగీకరించారు. తప్పుచేశానని, క్షేమించమని సీఎస్‌ఎన్‌కు లేఖ రాశారు. దాంతో వెంటనే ఈ సంస్థలు ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశాయి. ముంబైలో జన్మించిన ఫరిద్ జకరియా తండ్రి కాంగ్రెస్ నేత. తల్లి ఆ రెజుల్లోనే సండే టైమ్స్ ఆప్ ఇండియాకు ఎడిటర్‌గా పనిచేశారు. జర్నలిజంలో ఫరిద్ కృషికి భారత ప్రభుత్వం 2010లో పద్మభూషణ్ అవార్డ్‌నిచ్చి సత్కరించింది.