మాయమాటలకు లొంగి జీవితాలను నాశనం చేసుకోవద్దు: కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్
జనం సాక్షి/ కొల్చారం
మాయమాటకులకు లొంగి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ అన్నారు. శుక్రవారం కొల్చారం జూనియర్ కళాశాలలో మేలుకొలుపు పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజర్వ్ ఎస్సై, కళాజాత బృందం ఇంచార్జ్ మల్లయ్య, కొల్చారం ఎస్సైలు ముఖ్య అతిధులు గా హాజరై మాట్లాడారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమైనదన్నారు. ఈ దశలో విద్యార్థులు ప్రలోభాలకు ఆకర్షణకు గురై దారి తప్పితే విద్యార్థుల జీవితం నాశనమవుతుందన్నారు. విద్యార్థులు మద్యానికి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలని అన్నారు.మోసపురిత… మాయమాటలకు లొంగిపోయి ప్రేమలో మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని.. child marriages.. cyber crimes..గురించి పాటల ద్వారా మాటల ద్వారా మేజిక్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించినారు. కార్పెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సకృబాయి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వివిధ అంశాల మీద మేలుకొలుపు పోలీస్ కళాబృందం జిల్లా ఇంచార్జ్ సురేందర్ , జనార్దన్.. ఇసాక్.. విట్టల్.. విద్యార్థులకు అవగాహన కల్పించారు.