మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం.. స్వతంత్రంగా ఎదగాలి.
రాష్ట్ర హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ డైరెక్టర్ అలుగు వర్షిని .
సిరిసిల్లలో మర మగ్గాల పరిశీలన, ఉత్పత్తిదారులతో సమావేశం.
కాటన్ కోసం ఆలోచన చేస్తాము.
బతుకమ్మ బిల్లులు త్వరగా అందేలా చూస్తాం.
ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని హామీ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫస్ట్ 16. (జనంసాక్షి). సిరిసిల్లలో జరిగే మరమగ్గాల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్వతంత్రంగా ఎదగాలని సిరిసిల్ల నేతన్నల ఉద్దేశించి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్ డైరెక్టర్ అలుగు వర్షిని అన్నారు. బుధవారం అధికారులతో కలిసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని మరమగ్గాల యూనిట్లను పరిశీలించారు. నిర్వాహకులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం షాది ఖానాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మ్యాక్స్ సొసైటీల సభ్యులను పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కాటన్ వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వస్త్ర వ్యాపార సంఘం నాయకులు తాటిపాముల దామోదర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాటన్ పరిశ్రమతో పాటు అనుబంధంగా ఉన్న సైజింగ్ డైయింగ్ పరిషత్ పరిశ్రమలకు సంబంధించి పరిస్థితులను వివరించారు. కాటన్ రంగానికి చేయూత అందించాలని సూచించారు. వస్త్ర పరిశ్రమలోకి కొత్త తరాన్ని తీసుకొచ్చేందుకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చేయవలసిన మార్పులపై మంచే శ్రీనివాస్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండల సత్యంతో పాటు పలువురు వివరించారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్ డైరెక్టర్ అలుగు వర్షిని మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమ లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ముందుగానే కొంత సమాచారం తీసుకున్నానని తెలిపారు. బతుకమ్మ చీరల స్థానంలో కాటన్ బద్దలయింపుపై శాఖ పరంగా చర్చిస్తామని అన్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తికి సంబంధించి ప్రస్తుతం ఉన్న బకాయిలను రెండు నెలల లోగా అందించే ఏర్పాటు చేస్తామని అన్నారు. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్ పై నే ఆధారపడకుండా నాణ్యమైన ఉత్పత్తులను చేస్తూ సిరిసిల్ల బ్రాండ్ నిలబెట్టుకోవాలని కోరారు. మార్కెట్ పరంగా పూర్తిస్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. సమావేశంలో పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, వరంగల్ ఆర్డిడి అశోక్ , ఏడి సాగర్, మున్సిపల్ చైర్ పర్సన్ జిదం కళ, జిందం చక్రపాణి పలువురు అధికారులు పారిశ్రామికులు పాల్గొన్నారు.,