ముఖ్యమంత్రి కిరణ్ ప్రాంతీయ పక్షపాతి: కేటీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. సీమాంధ్ర ప్రాజెక్టులకు గ్యాస్ కోసం ఢిల్లీపై దండయాత్ర చేస్తారు కానీ, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో లేఖలు కూడా రాయరని ధ్వజమెత్తారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయవద్దని హెచ్చరించారు. నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయవద్దని హెచ్చరించారు. నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ల్యాంకో, జీఎంఆర్‌కు గ్యాస్ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. ల్యాంకో, జీఎంఆర్‌లు యూనిట్‌కి రూ. 3 లాభం పొందుతున్నాయని తెలిపారు. వాటికి గ్యాస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థల మీద చూపిస్తున్న ప్రేమను జెన్‌కో ప్రాజెక్టుల మీద సీఎం ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. అనుమతులు లేని పోలవరం ప్రాజెక్టుకు రూ. 4 వేల కోట్లు ఖర్చుపెట్టి ముందుకు పోతున్నారు. కానీ, నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో సీఎం అహంపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును టీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో న్యాయపోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితులో పోలవరాన్ని కట్టనీయమని తేచ్చిచెప్పారు. మెడికల్ సీట్ల విషయంలో గులాం నబీ ఆజాద్‌తో సీఎం ఎందుకు చర్చలు జరపలేదని ప్రశ్నించారు.