మృతి పట్ల ప్రముఖుల సంతాపం
సంతాపం..
ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ఎంవి కృష్ణారావు గారు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి .
కృష్ణారావు మరణం పత్రిక రంగానికి తీరని లోటు..
4 దశాబ్దాలుగా పత్రిక రంగంలో రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మృతి చెందడం అత్యంత బాధాకరం..
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి..
కృష్ణారావు మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటు
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్‌లో అకాల మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు. జర్నలిజంలో సరికొత్త విలువలను ఆద్యుడిగా ఆయన నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. బాబాయిగా అందరికీ సుపరిచితులైన కృష్ణారావు గారు గత నాలుగు దశాబ్దాలుగా పలు మీడియా సంస్థల్లో పనిచేస్తూ ప్రజలకు సేవ చేశారు. సమకాలీన రాజకీయ విశ్లేషణల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారు నిక్కచ్చిగా తన అభిప్రాయాలను చెబుతారనే పేరుగాంచారు. ఏ మీడియా సంస్థలో పనిచేసినా తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారి మరణం పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నాను. కృష్ణారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
భట్టి విక్రమార్క,
సీఎల్పీ నాయకులు
కృష్ణారావు మృతి అత్యంత బాధాకరం
జర్నలిజంలో సరికొత్త విలువలకు నాంది పలికిన కృష్ణారావు
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ఎంవీ కృష్ణారావు అకాల మరణం పాత్రికేయ ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నాను. ఎనలిస్ట్ గా నిక్కచ్చిగా అభిప్రాయాలను చెప్పే వ్యక్తి కృష్ణారావు గారు. తెలుగు, ఇంగ్లీషు జర్నలిజాల్లో మంచి ప్రావీణ్యం ఉన్న పాత్రికేయుడిగా క్రుష్ణారావుగారికి పేరుంది.
అభ్యుదయ భావాలు కలిగిన పాత్రికేయుడు కృష్ణారావుగారు.
లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విశ్లేషణలు, వార్తలు రాసేవారు. నాలుగు దశాబ్దాల పాత్రికేయ జీవితంలో నిజాయితీ, విలవలతో ఆయన పనిచేశారని చెప్పక తప్పదు.
వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
మధు యాష్కీ గౌడ్,
ఛైర్మన్, ప్రచార కమిటీ – టీపీసీసీ