మే 8 నాటికి తెంగాణ కోుకుంటుంది

` రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం`

తక్కువ కేసు చేస్తున్నామన్న ఆరోపణు సరికాదు

` అవసరమైన మేరకే చేస్తున్నాం

` వైద్య ఆరోగ్య మంత్రి ఈటల‌ రాజేందర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి):రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా కేసు నమోదైనట్లు తెంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల‌ రాజేందర్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసు సంఖ్య 1009కి చేరిందన్నారు. వీరిలో 25 మంది మృతిచెందగా.. 374 మంది కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం 610 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఈట వివరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నమోదైన వాటిలో 50 శాతానికి పైగా కేసు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే బయట పడ్డాయని తెలిపారు.  కరోనా మృతుల్లో దాదాపు 12 మంది క్యాన్సర్‌, బీపీ, ఇతర వ్యాధు కారణంగా చనిపోయారని మంత్రి వివరించారు. గ్బుర్గాకు చెందిన రెండు కేసు తెంగాణ కింద నమోదుచేసినట్లు మంత్రి వివరించారు. నాుగో స్టేజీలో ఉన్న క్యాన్సర్‌ రోగి చనిపోతే అదీ కరోనా కిందే లెక్కేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ వ్యక్తి చనిపోతే తెంగాణ కిందే నమోదు చేసినట్లు ఈట వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసిందని ఈట అన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రయత్నాు చేస్తోందని ప్రశంసు వచ్చాయన్నారు. ప్రజ ప్రాణాు కాపాడడంలో తెంగాణ ప్రభుత్వం కృషి అభినందనీయమని విదేశాల్లోని వారు సైతం ప్రశంసిస్తున్నారని చెప్పారు. కరోనా పరీక్ష కోసం ప్రైవేటు ల్యాబ్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆరురోజుగా పాజిటివ్‌ కేసు తగ్గడం శుభసూచకమని సీఎం కేసీఆర్‌ అన్నారని.. ఆయన వ్యాఖ్యు జీర్జించుకోలేని కొంత మంది టెస్టు తక్కువగా చేస్తున్నారంటూ అనవసర విమర్శు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే విమర్శు చేయడం ఏంటని ఈట మండిపడ్డారు.ఐసీఎంఆర్‌ మార్గదర్శకా ప్రకారమే పనిచేస్తున్నాం‘‘కరోనా కట్టడిలో తెంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యపట్ల స్వయంగా కేంద్ర బృందాలే సంతృప్తి వ్యక్తం చేశాయి. గత 50 రోజుగా అధికార యంత్రాంగమంతా కరోనా కట్టడి కోసం నిరంతరం పనిచేస్తోంది. బాధ్యతతో పనిచేస్తున్న ప్రభుత్వంపై అనవసర విమర్శు చేయవద్దు. కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయటపడాని తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ సమయంలో ఆకలితో అమటించకూడదని సీఎం పదేపదే చెబుతున్నారు. ఐసీఎంఆర్‌ జారీ చేసిన మార్గదర్శకా ప్రకారమే పని చేస్తున్నాం. టెస్టు చేసేందుకు ఎప్పుడూ వెనకాడేది లేదు. రోజుకు 1540 మందికి పరీక్షు చేసే సామర్థ్యం ఉంది. ఒకేరోజు 3,500కుపైగా టెస్టు చేసే సామర్థ్యం ఉన్న యంత్రాకు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చాం. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని మంత్రి  స్పష్టం చేశారు.మానవతా దృక్పథంతో ప్రభుత్వ సంరక్షణలో ఉంచాం‘‘పాజిటివ్‌ వచ్చిన వ్యక్తును హోం క్వారంటైన్‌ చేయాని కేంద్రం చెబుతోంది. కేంద్రం కొత్త నిబంధన ప్రకారం గాంధీ ఆస్పత్రిలో 10 మంది కంటే ఎక్కువ పట్టరు. పాజిటివ్‌గా నిర్ధారించిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచకుండా మానవతా దృక్పథంతో ప్రభుత్వ సంరక్షణలో ఉంచాం. ప్రైమరీ కాంటాక్టు ఉన్నచోటే అనుమానితును ఆస్పత్రుకు తీసుకొస్తాం. అలా లేని చోట నుంచి ఎవరినీ తీసుకురాం. పరిస్థితి విషమంగా ఉన్నవారికే పరీక్షు చేసి చికిత్స అందించాని చాలా దేశాు నిర్ణయించాయి. లాక్‌డౌన్‌ ప్రకటించగానే రాష్ట్రంలో పకడ్బందీగా అము చేశాం. ప్రపంచవ్యాప్తంగా 30 క్ష మందికి పాజిటివ్‌ వస్తే.. 2.11 క్ష మంది చనిపోయారు. చనిపోయినవారు కేవం 7 శాతం మాత్రమే. పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది బెల్జియంలోనే మృతి చెందారు. మనదేశంలో నమోదైన కేసుల్లో 3.2 శాతం ప్రాణాు కోల్పోయారు. రాష్ట్రంలో 19,063 టెస్టు చేస్తే 1009 మందికి పాజిటివ్‌ వచ్చింది.. వారిలో 25 మంది బాధితు చనిపోయారు. అంటే.. మృతు కేవం 2.5 శాతం మాత్రమే’’ అని ఈట వివరించారు.చికిత్స తీసుకుని భరోసాతో వెళ్తున్నారు‘‘కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికే సవాు విసిరింది. ఇది మతాకు సంబంధించింది కాదు.. మనుషుకు సంబంధించింది. కేరళ తర్వాత గొప్పగా ఉన్న రాష్ట్రం తెంగాణ. కరోనా పాజిటివ్‌ వచ్చినవారు ఇప్పుడు ఆందోళన చెందడం లేదు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని భరోసాతో ఇంటికి వెళ్తున్నారు. పాజిటివ్‌ కేసు, మరణాు దాచే అవసరం ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. సామాజిక మాధ్యమాల్లో  సొంత కవిత్వం రాస్తూ  ప్రజను భయభ్రాంతుకు గురి చేయడం మంచిది కాదు. కరోనా ఉద్ధృతి తగ్గి రాష్ట్రంలో సాధారణ పరిస్థితు రావాని కోరుతున్నాం. ఇకపై రాష్ట్రంలో మరణాు లేకుండానే కరోనా అంతం అవుతుందని ఆశిస్తున్నాం. మే 8 నాటికి పూర్తిగా కోుకుంటాం’’ అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజావార్తలు