రమణదీక్షితులపై టిడిపి నేతల విమర్శలు ఎందుకు?

అర్చకత్వంలో ఓనమాలు తెలియని వారు విమర్శలా
భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటే రాజకీయాల?
తిరుమలను పట్టించుకోకుండా బాబు కర్నాటకలో వేలెందుకు
తిరుమల పవిత్రత దెబ్బతింటుంటే చోద్యం చూస్తారా
సమాధానం చెప్పుకోవాల్సింది సిఎం చంద్రబాబే
అమరావతి,మే18(జ‌నం సాక్షి ): ఉన్నట్టుండి ఇప్పుడు తెలుగుదేశం పెద్దలంతా హిందూ ధార్మికతను వడబోసిన వేదపండితుల్లా తిరుమల ప్రధానార్చక పదవి నుంచి తొలగించబడిన రమణదీక్షితులుపై విరుచుకుపడుతున్నారు. అర్చక విభాగంలో ఓనమాలు తెలియని వారంతా ఆయన తప్పు చేశాడని విమర్శలు గుప్పిస్తున్నారు. డిప్యూటి సిఎం కెఇ కృష్ణమూర్తి, మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌,
బ్రహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్యలు ఇస్పటికైతే విమర్ళకుల్లో ముందున్నారు. ఇకముందు ఎందరు వస్తారో తెలియదు. తిరుమల ఆచారవ్యవహారలు, అర్చక విధానలు తెలియని వీరంతా దీక్షితులు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇకపోతే ఆ ఓనమాలే తెలియని అనేకమంది ఇవాళ టిటిడి బోర్డులో అధికారం వెలగబెడుతూ రమణదీక్షితులు తదితరులను తొలగించారు. తిరుమలను రాజకీయంగా భ్రష్టుపట్టించిన సిఎం చంద్రాబాబు ఇదంతా చోద్యం చూస్తున్నారు. నిజానికి రమణిదీక్షితులు ప్రశ్‌నలకు ఎందుకు స్పందించడం లేదు. ఎందుకు అలాంటి వారి సలహాలు తీసుకోవడం లేదు. ఎందుకు బోర్డులో ధార్మిక విషయాలను తెలియని వారిని నియమించారు. ఇవన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. కర్నాటక రాజకీయాల గురించి మాట్లాడుతున్న బాబు సొంత రాష్ట్రంలోని తిరుమలపై ఎందుకు నోరు మెదపడం లేదో ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పవిత్రతను కాపాడి భక్తుల మనోభావాలు పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పెత్తనం కోసం తద్భిన్నంగా వ్యవహరించింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతోందంటూ కోట్లాది మంది శ్రీవారి భక్తులు మండిపడుతున్న వేళ రమణదీక్షితులను తొలగించి అపచారం చేసింది.  ఆదిలో తిరుమల వేయికాళ్ల మండపాన్ని కూలదోయించిన సీఎం చంద్రబాబు దానిపై పదేపదే చినజీయర్‌ స్వామి ప్రశ్నించినా స్పందించలేదు.
తాజాగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగడంతో భక్తుల్లో అనుమానాలు రెట్టింపవుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి ఆలయంలో ప్రభుత్వ పెద్దలు భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారనే భావన నానాటికీ బలపడుతోంది. శతాబ్దాలుగా శ్రీవారికి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. వంశపారంపర్యంగా అర్చకులు స్వామి వారికి పూజాదికాలు, సేవలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల శ్రీవారిని మేలుకొలిపే సుప్రభాత సేవను ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నిర్వహిస్తుండటం, తోమాలసేవ వంటి సేవలను తక్కువ సమయంలోనే ముగించాలని అర్చకులపై ఒత్తిడి తెస్తుండటాన్ని జీర్ణించుకోలేక రమణదీక్షితులు ప్రశ్నించారు. చివరకు స్వామివారికి ప్రసాదాల నివేదనపై కూడా ఆంక్షలు విధించడం.. సేవలలో అధికార పార్టీ నేతలు వందిమాగధులతో హడావుడి చేస్తుండడంపై నిజాలు వెళ్లగక్కారు. అంటే ఇదంతా అధికార టిడిపి తనకు అనుకలంగా తిరుమలలో ఆటలు సాగిస్తోందని అర్థం అవుతోంది. అడుగడుగునా శ్రీవారి ఆలయ పవిత్రతను మంటగలుపుతుండటాన్ని చూసి సహించలేక ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తప్పులను  ఎత్తిచూపితే వందిమాగధులంతా ఆయననే విమర్శించడంరాజకీయం కాక మరోటి కాదు. తిరుమల వ్యవహారాలు ఏమైనా రజాకీయ వ్యవహారాలా అన్నది చంద్రబాబు చెప్పాలి. తప్పులను, అక్రమాలను కైంకర్యాలలో పొరపాట్లను ఎత్తిచూపిన  రమణదీక్షితులుపై కక్ష సాధింపులకు దిగడం ద్వారా ప్రభుత్వం రాజకీయంగా పెద్ద తప్పిదం చేసింది. ఇది
హిందువుల మనోహావాలను పూర్తిగా దెబ్బతీసే చర్య కాక మరోటి కాదు. రమణ దీక్షితులు లేవనెత్తిన ఏ ఒక్క అంశంపై అయినా ధర్మకర్తల మండలి ఎందుకు చర్చించలేదు.  అందుకే ఇప్పుటు భక్తుల్లో ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి.వంశపారంపర్యంగా 1996 వరకూ శ్రీవారి అభరణాలను సంరక్షిస్తూ వచ్చామని.. కానీ ఇప్పుడు వాటికి లెక్కలు చెప్పేవాళ్లు లేరని.. శ్రీకృష్ణదేవరాయులు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు ఏమయ్యాయో చెప్పాలని రమణదీక్షితులు ప్రశ్నించారు. భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలు స్వామి వారి సేవలకు మాత్రమే వినియోగించాలని, కానీ అధికారపార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు మంజూరు చేయాలని కోరడం ఏమిటని నిలదీశారు.
ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహిస్తున్నారని రమణదీక్షితులు మండిపడ్డారు. ఆయన ఎత్తిచూపిన తప్పులను దిద్దుకోవాల్సిన తిరుమల అధికారులు రాజకీయంగా ఆయనపై ఆరోపణలు చేసేలా ఎందుకు చేస్తున్నారు. /ూష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీతోపాటూ ఇతర ప్రధాన ఆలయాలపై రాజకీయ పెత్తనం చెలాయిస్తూ వస్తోంది.
గతంలో వైఎస్‌ అధికారంలో ఉండగా ఇలాగే చేశారు. ఇప్పుడు టిడిపి అలానే చేస్తోంది. దుర్గగుడిలో ఇటీవలి ఘటనలు కూడా ఆందోళన కలిగించేలా ఉన్నాయి.  తాము ఎంపిక చేసుకున్న అధికారుల ద్వారా టీటీడీలో ఇష్టారాజ్యంగా పనులు చక్కబెట్టుకున్నారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఇటీవలే పాలకమండలిని ఏర్పాటు చేసినప్పటికీ అందులో అన్యమతానికి చెందిన ఎమ్మెల్యేను నియమించారనే విమర్శలు వచ్చాయి. దాంతో ఆ ఎమ్మెల్యేలను తొలగించారు. పాలకమండలి అధ్యక్షుడిపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చినా పట్టించుకోలేదు. తిరుమల పవిత్రతతకు భంగం వాటిల్ల చేసి బక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారెవరూ రాజకీయంగా మనుగడ సాగించలేదు. ఇది గుర్తుంచుకుని చంద్రబాబు తగు చర్యలు తీసుకుని తిరుమల పవిత్రతను కాపాడాల్సి ఉంది.