రమణదీక్షితులు ఆరోపణలపై ఎదురు దాడా?

సిబిఐ విచారణతో నిజాలు నిగ్గు తేల్చాలి
విజయసాయి ఆరోపణల మేర బాబు ఇల్లు సోదా చేయాలి
సిపిఐ కార్యదర్శి నారాయణ డిమాండ్‌
తిరుపతి,మే24(జ‌నం సాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం మాజి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు దేవస్థానంలో జరుగుతున్న అవినీతి  పనులపై లేవనెత్తిన అంశాలపై  సి.బి.ఐ విచారణ చెయ్యాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ  డిమాండ్‌ చేసారు. దీనిపై విచారణ చేయకుండా ఎదురుదాడి చేయడం, ప్రతి విమర్శలు చేయడం,ఉద్యోగుఏలతో నిరసనలు చేయించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. శ్రీకాళహస్తిలో స్థానిక పంచాయతీ రాజ్‌ అతిదిగృహమునందు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అలాగే తనను దేవస్థానం ప్రధాన అర్చకుడి స్థానం నుంచి తొలగిస్తారు అని తెలిసి ఒకరోజు ముందుగా తమిళనాడులో పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చెయ్యడంలో ఆంతర్యం ఏమిటో రమణదీక్షితులు చెప్పాలన్నారు.  అలాగే అప్పటి వరకు జరిగిన తప్పులను భక్తులకు ఎందుకు చెప్పలేదో చెప్పాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుపై వై .యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వామి వారి బంగారు ఆభరణాలను చంద్రబాబు ఇంట్లో దాచి ఉంచారు అని ఆరోపించారు, దీనిపై కూడా రమణదీక్షితులు, విజయసాయి రెడ్డిలను కోర్టు ద్వారా కాని ఏదైనా ప్రభుత్వ విచారణ సంస్థల ద్వారా చంద్రబాబు నివాసంలో సోదాలు నిర్వహించాలని అన్నరు.  ఒకవేళ చంద్రబాబు తప్ప చేసినట్లు నిరుపణ జరిగితే అతనిని ఉరితీసినా  తప్పు లెదన్నారు. అయితే తిరుమలలో ఏం జరుగుతందో అన్న ఆందోళన భక్తుల్లో ఉందని, దానిని పరిస్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.   తమిళనాడులోని తుత్తికుడి వద్ద గత ముడు నెలలుగా కెమికల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో వందోరోజున ఉద్యమ కారులపై జరిపిన కాల్పుల్లో సుమారు పదమూడు మందికి పైగా మరణించారు. అలాగే వంద మందికి పైగా గాయపడ్డారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సర్కారి హత్యగా సి.పి.ఐ భావిస్తున్నదని అన్నారు.   మరణించిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. అలాగే దేశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉత్తర దక్షిణ ధృవాలుగా ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్షాలు అన్ని ఏకమౌతున్నాయి. వీటికి నిదర్శనంగా నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణా స్వీకారంలో అని ప్రతిపక్షాలు హాజరు కావడం మోడీ వ్యతిరేక కూటమికి నిదర్శనం అని తెలిపారు. మోడీ విధానాలపట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం
అవుతున్నాయని అన్నారు.