రాజ్యసభకు కేకే, సురేష్ రెడ్డి ఎకగ్రీవం

హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఫలితం ముందే తెలిసినప్పటికీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్.సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల గడువు గడిచిన శుక్రవారంతో ముగిసింది. 16న నామినేషన్లను పరిశీలించారు. బుధవారం సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు. కాగా పోటీ అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఇరువురి ఏకగ్రీవ ఎన్నికపట్ల పలువురు రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే నుంచి త్రిచి శివ, ఎస్ఆర్ ఎలంగో, అంతియూర్ సెల్వరాజ్ ఎన్నికవగా ఏఐఏడీఎంకే నుంచి కేపీ మునుస్వామి, ఎం.తంబిదురై ఎన్నికయ్యారు. తమిళ మనీలా కాంగ్రెస్ నుంచి

వేశంలో లు తెలిపారు. తెలంగభకు ఏకగ్రీవంగా ఎన్నుకుపొరనున్నట్లు తెలిపినంగా ఉన్నాయని సీఎం కుష్పకూలిన స్టాక్ మార్కెట్ రాష్ట్ర ప్రజలు గర్వపడేలా, టీఆర్ఎస్ పార్టీ పేరు నిలబెట్టేలా తాము పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేకే, సురేష్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, ఆర్.సురేష్ రెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ఎల్పి ఆఫీసులో కక మాట్లాడుతూ.. తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలన్నారు. కేసీఆర్ ఆశయాలను పూర్తిచేసేలా పనిచేస్తామన్నారు. దేశంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయని సీఎం ఆదేశాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు సాగనున్నట్లు తెలిపారు. కేఆర్. సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ గర్వపడేలా తన ప్రయత్నం ఉంటుందన్నారు. దేశంలో పరిస్థితులను అనుసరించి టీఆర్ఎస్ సిద్ధాంతపరంగా తన వాయిస్ అందించనున్నట్లు తెలిపారు. తన జీవితంలో ఇదొక పెద్ద ఛాలెంజ్ అన్నారు. రాజ్యసభ అంటే రాష్ట్రాలపై నిఘాలాగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ పేరు నిలబెట్టేలాగా పనితీరు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తాజావార్తలు