రాజ్యాధికారం దిశగా బహుజన రాజ్యాన్ని సాధించిన సర్జాల్ పాల్వాయి పాపన్న గౌడ్ జిల్లా అదనపు కలెక్టర్ లింగౣనాయక్
వికారాబాద్ రూరల్, ఆగస్ట్ 18: జనం సాక్షి
రాజ్యాధికార దిశగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ కొనియాడారు.
శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అధనపు కలెక్టర్ మాట్లాడుతూ.సర్వాయి పాపన్న సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి 12 మందితో మొదలుపెట్టి 12 వేల మంది సైన్యాన్ని తయారుచేసి గెరిల్లా పోరాటం చేశారని ఆయన తెలిపారు. భూస్వాములు, మొగల్ లు శిస్తుల రూపంలో పన్నుల వసూల్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మహనీయులను గుర్తించి జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ్ లక్ష్మి,షాదీ ముబారక్, గృహలక్ష్మి పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు.జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను అనుసరిస్తూ రాజకీయపరంగా ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులు అంతరించే క్రమంలో వారిని ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత నివ్వడం జరుగుతుందని తెలిపారు. అట్టడుగున ఉన్న ప్రజలను ఆదుకునే దిశగా గీతా కార్మికులకు 2 వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే గీత భీమ కింద 5 లక్షల రూపాయలను తమ కుటుంబాలకు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వం గౌడ సామాజిక వర్గానికి మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు.జయంతి ఉత్సవాల్లో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, దళిత,బహుజన సంఘాల నాయకులు సంగీతపు రాజలింగం, కృష్ణయ్య, జగదీష్, దత్తు,విట్టల్ , రమేష్ ,బందయ్య గౌడ్ , శ్రీనివాస్ గౌడ్,రాజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.