రాష్ట్రంలో క్వారంటైన్‌ నుంచి 25,837 మంది డిశ్చార్జ్‌…

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):తెంగాణలో గత కొన్నాళ్లుగా క్వారంటైన్‌లో ఉన్న 25,837 మంది పూర్తిగా డిశ్చార్జ్‌ అయినట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెంగాణలో విదేశా నుంచి వచ్చిన 34 మందికి, వారి ద్వారా మరికొందరికి కరోనా వైరస్‌ వచ్చిందని చెప్పారు. వారిలో చాలా మంది డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. తెంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 503 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందులో 14 మంది ప్రాణాు కోల్పోయారు. చికిత్స తీసుకున్న తర్వాత కరోనా తగ్గడంతో 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 393 మంత్రి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఏ ఒక్కరికి కూడా సీరియస్‌గా లేదని కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం 1654 మంది క్వారంటైన్‌లో ఉన్నారని కేసీఆర్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 24 తర్వాత వారి క్వారంటైన్‌ గడువు కూడా ముగుస్తుందని చెప్పారు. ఆ తర్వాత కొత్తగా కరోనా కేసు రాకపోవచ్చని కేసీఆర్‌ అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం 243 కంటైన్మెంట్‌ ఏరియాు ఉన్నాయని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నట్టు తెలిపారు.

తాజావార్తలు