లాక్‌డౌన్ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి
త్వరలో పరిస్థితులన్నీ సర్దుకుంటాయి..
హైదరాబాద్, ఏప్రిల్ 13(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వలస కూ లీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. గచ్చిబౌ లిలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్లో పని చేసేందుకు వచ్చిన సుమారు 400 మంది కూలీల క్యాంపును మంత్రి తనిఖీ చేశారు. ఆ ఈ సందర్భంగా వలస కూలీల యో గక్షేమాలు, ఆహారం, రేషన్ సరకుల గురిం చి అడిగి తెలుసుకున్నారు. అందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, ఆరోగ్యా న్ని కాపాడుకోవాలని మంత్రి సూచించా రు. మరో రెండు వారాల పాటు ఎవరూ బయటకు వెళ్లకుండా ఏర్పాటు చేసిన వస తిలోనే ఉండాలని కోరారు. ప్రస్తుతం తమ కు ఎలాంటి ఇబ్బంది లేదని కూలీలు.. కేటీ ఆరు తెలిపారు.
కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్మాణ కంపెనీ ప్రతినిధులు, అధికారులకు మంత్రి సూచించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా తెలంగాణలో లా డౌన్ విధించిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని సరఫరా చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు ప్రతి రేషన్ కార్డుకు రూ. 1,500 చొప్పున పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 74 లక్షల మందికి పైగా ఖాతాల్లోకి ఏప్రిల్ 14న రూ. 1,500 చొప్పున జమ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇందుకు గానూ బ్యాంకులకు ప్రభుత్వం రూ. 1,112 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఇక 12 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం ఇస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకు బియ్యం పంపిణీ 87 శాతం పూర్తయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 76 లక్షల మంది రేషన్ కార్డు దారులు బియ్యాన్ని తీసుకున్నారని తెలిపారు. మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని విజయవంతంగా పంపిణీ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బియ్యం పంపిణీ విజయవంతం చేసినందుకు గానూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకరన్ను కేటీఆర్ అభినందించారు.