వదంతులు నమొదు

. తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ కాలేదు

• ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు నేడు ఉన్నతస్థాయి సమీక్ష చేస్తామన్న మంత్రి ఈటెల

• ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం

హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలే దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ వైరస్ విషయంలో వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దు అని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలను పర్యవేక్షణ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ పై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర వైద్యుల బృందం హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పర్యటిస్తుందన్నారు. ఉన్నతస్థాయిసమర్పించాలని

సమీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం.. ప్రజలు భయపడొద్దని మంత్రి సూచించారు. మరోవైపు ఫీవర్ ఆస్పత్రిని కేంద్ర వైద్య బృందం పరిశీలించింది. ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులను ఎయిమ్స్ వైద్యుల బృందం పరిశీలించినట్లు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. కరోనా వైరస్ వల్ల తాజాగా 24 మంది మృతిచెందారు. దీంతో చైనాలో ఆ వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 106కు చేరుకున్నది. కరోనా వైరస్ సోకిన బాధితులు నుమోనియా వ్యాధితో మరణిస్తున్నారు. అయితే ఆ వైరస్ సుమారు 4515 మందికి సోకినట్లు తాజాగా అధికారులు నిర్ధారించారు. ఒక టిబెట్ మినహా.. మిగితా చైనా ప్రానిన్సుల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, కారేపల్లి అమెరికా, వియత్నాం , సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేంద్ర బిందువైన హుబెన్ ప్రావిన్సులో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు నగరంలోని ఫీవర్ ఆసుపత్రికి కేంద్ర జరుగుతుందన్నారువైద్యుల బృందం మంగళవారం చేరుకుంది. ఆసుపత్రిలోని ఐసోలేటేడ్ వార్డులను, కరోనా వైరస్ అనుమానితుల చికిత్స వార్డులను కేంద్ర వైద్యుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండ్ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ఎలాంటికేసుకు నమోదు కాలేదని తెలిపారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పుణెకు పరిక్షలకోసం పంపిస్తే నెగటివ్ గా తేలిందని అన్నారు. ఈ రోజు మూడు కేందప్రత్యేక వైద్య బృందాలు ఫీవర్ హాస్పిటల్ సందర్శించనున్నారని, చైనా నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులను ఫీవర్ ఆసుపత్రిలో పరిక్షించనున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంబంధించి తగు సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు, ఫీవర్ హాస్పిటల్ లో 40 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నఆసుపత్రి డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఇదిలావుంటే కరోనా వైరస్ పై ఎపి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కడా నమోదు కాలేదని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి పై అవగాహన కల్పించాలని తెలిపారు.

తాజావార్తలు