వదంతుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి

అధికారులకు సిఎం చంద్రబాబు హెచ్చరిక
అమరావతి,మే23( జ‌నం సాక్షి):  అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం  చేశారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సవిూక్ష నిర్వహించాలని డీజీపీని చంద్రబాబు ఆదేశించారు. వదంతులు వ్యాపింపచేసి ప్రజల్లో భయం పెంచేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు జరుగుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలన్‌ఆనరు. ఇకపోతే రాబోయే ఖరీఫ్‌ సీజన్‌లో నారుమళ్లకు వీలుగా నీటి విడుదలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలపై బుధవారం ఆయన సవిూక్షించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా నీటిమట్టాలపై పరిశీలన చేశారు. ప్రధాన జలాశయాల్లో 207.31 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. విూడియం జలాశయాల్లో 107టీఎంసీలకు గాను 27.9టీఎంసీల నీటిని నిల్వ చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ.. జలాశయాల్లో నీటినిల్వ, ఎగువనుంచి వరద ప్రవాహం ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశర చేశారు. జల సంరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.