విండీస్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా గెలిస్తే సెమీస్ బెర్త్
ఓవల్ ,జూన్ 10 (జనంసాక్షి) :
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు కరేబియన్ సమరానికి సిధ్దమైంది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. అన్ని విభా గాల్లోనూ విండీస్ కంటే బలంగా కనిపిస్తోన్న ధోనీసేననే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై విజయం భారత్ కాన్ఫిడెన్స్ పెంచిందని చెప్పొచ్చు. ఆ మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ సత్తా ఏపాటిదో మరోసారి రుజువు చేసింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. భారీస్కోర్ నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ సెహ్వాగ్, గంభీర్ లేని లోటును తన బ్యాటింగ్‌తో తీర్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ ఆరోసీజన్‌లో కొన్ని మ్యాచ్‌లే ఆడినప్పటకీ… తన మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగించి సెంచరీతో అరంగేట్రం చేశాడు. టాపార్డర్‌లో కోహ్లీ, మిడిలార్డర్‌లో రైనా, ధోనీ, దినేష్ కార్తీక్ కూడా ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. చివర్లో రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్ కూడా భారత్‌కు అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. అటు బౌలింగ్‌లో సీనియర్లు లేకున్నా మన పేస్ త్రయం సక్సెస్‌ఫుల్‌గా భారా న్ని మోస్తోంది. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమా ర్, ఇశాంత్ శర్మ రాణిస్తుండగా… స్పిన్ విభాగంలో అశ్విన్, జడేజా తమదైన పాత్ర పోషిస్తున్నారు. గత మ్యాచ్‌లో పేసర్లు కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చిన ప్పటకీ, కీలక సమయంలో వికెట్లు పడగొట్టడం విజ యానికి కారణమైంది. అలాగే పార్ట్‌టైమ్ బౌలర్ రవీం ద్ర జడేజా జట్టుకు అద్భుతమైన ముగింపు నిస్తున్నాడు. అయితే భారత బౌలర్లు విండీస్ వి ధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను ఔట్ చేయ డంపైనే మన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరోవైపు తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై పోరాడి గెలిచిన వెస్టిండీస్ కూడా సెవిూస్ బెర్తుకు చేరునలో ఉంది. భారత్‌పై గెలుపుతోనే దానిని ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. బౌలింగ్ పరంగా విండీస్ పటిష్టంగా కనిపిస్తోంది. పాక్‌పై ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని 171 పరుగులకే కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్‌లో నిలకడలేమి వారికి మైనస్ పాయింట్. గేల్ ప్రధాన బలమైతే… మిగిలిన బ్యాట్స్‌మెన్ మాత్రం నిలకడగా రాణించలేక పోతున్నారు. పాకిస్థాన్‌పై వారి బ్యాటింగే దీనికి ఉదాహరణ. దీంతో భారత్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడం ద్వారా సక్సెస్ కావాలని వ్యూహాలు రచిస్తోంది.