విత్తన వేరుశనగ పంపిణీ

అనంతపురం,మే24(జ‌నం సాక్షి): వేరుశనగ విత్తన పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతేడాది మాదిరిగానే బయోమెట్రిక్‌ విధానం ద్వారా పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌  అన్నారు. ఖరీఫ్‌లో సబ్సిడీ విత్తన కాయల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుచెప్పారు.   విత్తన నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అందుబాటులో విత్తన కాయలను ఉంచుతామన్నారు. విత్తన పంపిణీలో ఎలాంటి ఇబ్బందులకు తావివ్వోద్దని ఆదేశించారు. పొగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజాసాధికారిక సర్వే ఆధారంగా గ్యాస్‌ కనెక్షన్‌లేని వారిని గుర్తించి కనెక్షన్లు అందిస్తున్నామన్నారు.  అద్దె భవనాల్లో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గదుల్లోకి మార్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.