విదేశాల నుంచి వచ్చే వారందరికీ క్వారంటైన్

రాష్ట్రంలో | ఆరో కేసు నమోదు సెలవులు ప్రకటించింది విహార యాత్రలకు కాదు మంత్రి ఈటల

హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైద రాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కాట్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 6కు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కరోనా ప్రభా వం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి తప్పకుండా స్క్రీనింగ్ చేస్తూ.. వారికి ప్రభుత్వం గుర్తించిన క్వారంటైన్ సెంటర్లలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందన్నారు. నిమ్స్, ఫీవర్, ఐపీఎం, ఉస్మానియా ఆస్పత్రుల్లో ల్యాబ్స్ ఏర్పాటు పూర్తి అయిందన్నారు. భారత్ లో ఎక్కడా నేరుగా కరోనా రాలేదని ఐసీఎంఆర్ ఒక నివేదికలో ప్రకటించిందని మంత్రి ఈటల తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులను సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. క్వారంటైన్లు సిద్ధం విదేశాల నుంచి 20 వేల మందికి పైగా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా కావాల్సినన్ని క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈటల వివరించారు. ఈ క్వారంటైన్ సెంటర్లు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటాయన్నారు. ప్రతి క్యారంటైన్ సెంటర్ లో ఒక వైద్యుడు, వైద్యుడికి సాయంగా కావాల్సిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. వికారాబాద్, దూలపల్లిలో క్వారంటైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని, వాటితో పాటుగా మరికొన్ని క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. విమానాశ్రయాల్లో నిత్యం స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని, కరోనా లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని 40 ప్రత్యేక బస్సుల ద్వారా క్వారంటైన్ సెంటర్లకు తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా ప్రభావం గుర్తించకముందు రాష్ట్రానికి వచ్చిన వారిని కూడా గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. సెలవులు పర్యటనలకా? కరోనాకు సంబంధించి ఎక్కడా రాజీపడకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు ఏవైనా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు మంత్రి ఈటల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు సెలవులు ప్రకటించింది ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారని తప్ప ప్రయాణాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు కాదని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైరస్ బారిన పడకుండా పిల్లలను చూసుకునే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదేనన్నారు. కరోనా తీవ్రత తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లాడని మంత్రి సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఈటల విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను నెలాఖరు దాకా మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కోవలో తాజాగా ఆర్టీసీ కండక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. ఇకపై కండక్టర్లు తప్పనిసరిగా తమ దగ్గర హ్యాండ్ శానిటైజర్లను ఉంచుకోవాలని తెలిపింది. బస్సులో ప్రయాణించే ప్రయాణీకులకు రెండు చుక్కలు వాళ్ల చేతులో వేసి రాసుకోమని సూచించాలని చెప్పింది. కండక్టర్లకు హ్యాండ్ శానిటైజర్లను ఆర్టీసీ యాజమాన్యమే సమకూర్చుతుంది. తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కాగా, ప్రభు కండక్టర్లు శానిటైజర్లు ఉపయోగించు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంగతి తెలిసిందే. ఈ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారానే కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానికంగా కరోనా వైరస్ లేదన్నారు. కావున, కరోనా వ్యాప్తి నివారణకు విదేశాల నుంచి ప్రయాణీకులను అధికారులు నిలువరించాల్సిందిగా పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా కోవిడ్-19 బాధిత దేశాల నుంచి హైదరాబాదు వచ్చే విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. కరోనాను అడ్డుకునేందేకు చేపట్టని నివారణకు చర్యల్లో భాగంగా సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను నిలిపివేసింది. ఉదృతం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణ, లీ చికిత్సపై మంత్రి ఈటల అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. భేటీకి సీఎస్, డీజీపీ, సర్పంతోపాటు ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ అధికారులు హాజరయ్యారు. విదేశాలనుంచి వచ్చే వారి సంఖ్య వార్డు పెరుగుతోందని వారందరినీ క్వారంబైలో ఉంచే ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. క్వారంటైన్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎసను మంత్రి ఆదేశించారు. ఎంత మంది బాధితులు వచ్చినా చికిత్సకు సిద్ధంగా ఉండాలన్నారు.

తాజావార్తలు