సమస్యలపై దామచర్ల ప్రత్యేక శ్రద్ద
సమస్యల పరిష్కారంపై తనదైన ముద్ర
ఒంగోలు,మే18(జనం సాక్షి ): పార్టీ నడపడం భారంగా మారడంతో ప్రకాశం టిడిపి బాధ్యతల నిర్వహణకు పలువురు ఉత్సాహం చూపడం లేదని సమాచారం. 2010 సంవత్సరం నుండి జిల్లాపార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని బలోపేతం చేశారు. కార్యాలయనిర్వాహణ బాధ్యతలతోపాటు, పార్టీ పురోభివృద్ధికి కోట్లాది రూపాయలను ఖర్చుచేశారు. ప్రస్తుతం జిల్లాపార్టీ పగ్గాలు చేపట్టేందుకు కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదన్న వాదన ఆ పార్టీ నేతల నుండి వినిపిస్తోంది. పార్టీ బాధ్యతలు మోయాలేంటే ఆర్థికపరంగా బలిష్టమైన నేత అవసరం ఉంది. అలాంటి నేతలు పార్టీపగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపించటంలేదు. జిల్లాపార్టీ పగ్గాలు చేపడుతూనే మరొకపక్క ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యునిగా దామచర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. అలాగే జిల్లా సమస్యలపైనా మంత్రలు పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పాల రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే చెల్లింపులకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డెయిరీ పరువును బజారుకీడ్చవద్దని హితవు చెప్పారు. సమస్యలపై ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగా పార్టీకి మంచి పట్టు దక్కింది. 2010-12 సంవత్సరంలో మొదటిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం 2012-14, 2014- 16 సంవత్సరం వరకు జిల్లాపార్టీ అధ్యక్షునిగానే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో లేని సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టి టిడిపిని బలోపేతం చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషిచేశారు. కరణం బలరాం తరువాత దామచర్లకు పార్టీపగ్గాలను చంద్రబాబు అప్పగించిన తరువాత జనార్ధన్ కోట్లాది రూపాయల
విలువైన తన స్థలాన్ని జిల్లాపార్టీ కార్యాలయంగా మార్చారు. ఇప్పటికి తనస్వంత స్థలంలోనే పార్టీకార్యాలయ నిర్వహణ సాగుతుంది. జనార్ధన్ తాత దామచర్ల ఆంజనేయులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖమంత్రిగా పనిచేశారు. ఆంజనేయులు చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండటంతో ఆయన మనవుడిగా జిల్లాపార్టీ పగ్గాలను అప్పగించారు. గతంలో ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి ఆమడదూరంలో ఉండేదని, ప్రస్తుతం అభివృద్ధికి కేరాఫ్‌గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
——————-