సిగ్గుతో తలదించుకుంటున్నా: జితేంద్ర

– ఫిక్సింగ్‌ నియంత్రణకు కఠిన చట్టం

న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి):ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌  వ్యవహారంపై సిగ్గుతో తలదించుకుంటున్నానని కేంద్ర క్రీడల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. ఇది క్రికెట్‌కే దుర్దినమని వ్యాఖ్యానించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌తో క్రికెట్‌ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఇది చాలా అవమానకరం, యువకుడిగా, క్రీడాభిమానిగా, ఈ దేశ క్రీడల మంత్రిగా సిగ్గుతో తలదించుకుంటున్నానని అన్నారు. కఠిన చట్టాలతోనే ఫిక్సింగ్‌కు అడ్డుకట్ట వేయగలమని తెలిపారు. ఫిక్సింగ్‌ను నిరోధించే యంత్రాంగం పటిష్టంగా ఉంటే ఇలాంటివి పునరావృతవం కావని అభిప్రాయపడ్డారు. ఫిక్సింగ్‌అనేది ఒక్క క్రికెట్‌లోనే కాదని.. మిగతా అన్ని క్రీడల్లోనూ ఉందని వ్యాఖ్యానించారు. ఫిక్సింగ్‌నియంత్రణకు కఠిన చట్టాలను తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు ¬ం, న్యాయ శాఖలతో సంప్రదిస్తున్నామని, అలాగే అటార్నీ జనరల్‌ను సంప్రదించనున్నట్లు చెప్పారు. ”ఫిక్సింగ్‌ జాడ్యాన్ని నియంత్రించేందుకు చట్టం అవసరం. మిగతా క్రీడల్లో ఇది (ఫిక్సింగ్‌) జరగడం లేదని గ్యారంటీ ఇవ్వలేం. ఇతర క్రీడల్లోనూ ఇది లేదని ఎవరికెరుక్ణ అని వ్యాఖ్యానించారు. బుకీలకు, ఐపీఎల్‌ జట్టు యజమానులకు (చెన్నై సూపంకింగ్‌) గల సంబంధాలపై వ్యాఖ్యానించేందుకు మంత్రి నిరాకరించారు. ”దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పడే దానిపై ఏవిూ మాట్లాడలేన్ణు అని అన్నారు. 2000 సంవత్సరంలో క్రికెట్లో ఫిక్సింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు యాంటీ ఫిక్సింస్త్ర చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించగా… ”గతంలో ఏం జరిగిందనే దానిపై నేను స్పందించను. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంద్ణి అని అన్నారు. వీలైనంత త్వరగా మెరుగైన చట్టాన్ని తీసుకువస్తామన్నారు.