సీమ సమస్యలపై నిర్లక్ష్యం తగదు

ఉక్కు ఫ్యాక్టరీతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం
కడప,మే24(జ‌నం సాక్షి): సీమ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని సిపిఐ,సిపిఎం నేతలు అన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాటలతో కాలయాపన చేస్తూ  మూడేళ్లు గడిపారని అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రత్యేక¬దా అంటున్నారని సిఎం చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. నాలుగేళ్ల సమయం వృధా చేశారని అన్నారు.  కూలీలు వలస వెళుతున్నా, రైతులు ఇబ్బంది పడుతున్నా పాలకులకు పట్టిలేకుండా పోయిందన్నారు.  రాయలసీమలో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణం నిధులు విడుదల చేయాలని కోరారు.  రాయలసీమ అభివృద్దికి ప్రత్యేక ప్యాకేజితో పాటు, కరువు నిధి ఏర్పాటు చేయాలని లెఫ్ట్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం ఇచ్చి వాగ్దానాలను అమలు చేయాలని అందులో భాగంగా రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు లేక కరువు విలయతాండవం చేస్తోందన్నారు. రాయలసీమ ప్రజలు కేరళ, గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్నారని  మండిపడ్డారు. ఈ వలసలను ఆపాలంటే కరువు సహాయక నిధి ఏర్పాటు చేయాలని అన్నారు.  వలసలు వెళ్లిన కుటుంబాలలోని వృద్ధులు, పిల్లల కోసం గ్రామాల్లో ఉచిత సంగటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని తెలిపారు. దీని వల్ల చాలామందికి నిరుద్యోగ భృతి లభిస్తుందన్నారు. పండ్ల తోటలకు బీమా సదుపాయం కల్పించాలన్నారు.రాయలసీమ అభివృద్దికి చేపట్టాల్సిన పనుల గురించి చేసిన హావిూలను అమలు చేయాలన్నారు.
—————-