సోషల్ విూడియాలో వదంతులు నమ్మొద్దు
– దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– ఏపీ డీజీపీ మాలకొండయ్య
అమరావతి, మే24(జనం సాక్షి) : సోషల్‌విూడియా వస్తున్న వందతులను ప్రజలెవరూ నమ్మొద్దని ఆంధప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్ట్స్ లో గురువారం విూడియాతో మాట్లాడిన ఆయన.. వదంతుల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమాయకులపై దాడులు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ విూడియాలో వదంతులు సృష్టిస్తున్న కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి తప్ప వారిపై దాడులకు పాల్పడటం సమంజసం కాదని డీజపీ హెచ్చరించారు. గత వారం రోజులుగా పలువురిపై ఆయా ప్రాంతాల ప్రజలు అనుమానంతో దాడులు నిర్వహించారని అన్నారు. ఏపీలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు ఉన్నాయంటూ దుష్పచారం జరుగుతుందని అవన్నీ వందతులేనని అన్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతకు ముందు పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం అమరావతిలో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సోషల్ విూడియాలో అసత్యప్రచారం, దాడుల ఘటనలపై సవిూక్ష జరిపారు. ఇటీవల దొంగల పేరుతో అమాయకులపై దాడులు జరుతున్న విషయంపై సీరియస్ గా దృష్టిసారించాలని, అలాగే ఈ ఘటనల మాటున సంఘ విద్రోహక శక్తులు విధ్వంసాలు సృష్టించే అవకాశముందని, దీనిపై దృష్టిసారించాలని డీజీపీ మాలకొండయ్యను ఆదేశించారు. అలాగే సోషల్ విూడియాలో వదంతులను సృష్టిస్తున్న వారిని గుర్తించాలని సీఎం ఆదేశించారు.