సోషల్‌ విూడియా దుష్పచ్రారాలపై జాగ్రత్త

పోలీస్‌ అధికారులతో సిఎం చంద్రబాబు సవిూక్ష
అమరావతి,మే24(జ‌నం సాక్షి):  పోలీస్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం అమరావతిలో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సోషల్‌ విూడియాలో అసత్యప్రచారం, దాడుల ఘటనలపై సవిూక్ష జరిపారు. ఇటీవల దొంగల పేరుతో అమాయకులపై దాడులు జరుతున్న విషయంపై సీరియస్‌గా దృష్టిసారించాలని, అలాగే ఈ ఘటనల మాటున సంఘ విద్రోహక శక్తులు విధ్వంసాలు సృష్టించే అవకాశముందని, దీనిపై దృష్టిసారించాలని డీజీపీ మాలకొండయ్యనే ఆదేశించారు. అలాగే సోషల్‌ విూడియాలో వదంతులను సృష్టిస్తున్న వారిని గుర్తించాలని సిఎం ఆదేశించారు. ఇదిలావుంటే ప్రతిపక్ష నేత జగన్‌ వైఖరిపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మెగా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకించే జగన్‌.. ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఒకవైపు అభివృద్ధిని అడ్డుకుంటూనే మరోవైపు రైతు సమస్యలప జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా ధరల పతనంపై అధికారులతో సీఎం చంద్రబాబు సవిూక్ష జరిపారు. ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం స్పందించాలన్నారు. కేంద్ర వాణిజ్యమంత్రితో మాట్లాడాలని సీఎస్‌కు చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే తాను కేంద్రమంత్రి సురేష్‌ ప్రభుకు లేఖ రాశానని తెలిపారు. తక్షణమే ఢిల్లీ వెళ్లి సురేష్‌ ప్రభుతో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి ఆదినారాయణ రెడ్డికి సీఎం సూచించారు. ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో 26న సమావేశం అవుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ బయలుదేరారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం తెలంగాణ టీడీపీ మహానాడులో పాల్గొంటారు.
—————