స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారింది నువ్వే..!

జనంసాక్షి, కమాన్ పూర్ : గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీధర్ బాబు మద్దతుతో గెలిచిన కొండ వెంకటేష్ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సబబు కాదని పెంచికలపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఏఎంసి డైరెక్టర్ అనవేన వేణు అన్నారు. శుక్రవారం కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సర్పంచ్ ఎన్నికల్లో నేను వెంట ఉండి సర్పంచ్ కొండ వెంకటేష్ ను గెలిపించడం జరిగిందని తెలిపారు. కొండా వెంకటేష్ నిన్ను అతి చిన్న వయసులోనే శ్రీధర్ బాబు అక్కున చేర్చుకొని ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడిగా నీకు అవకాశం కల్పించి పెంచికలపేట గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం కల్పిస్తే శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధిని చూసి నీకు గ్రామ ప్రజలు ఓటు వేశారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నీవు నీతులు చెప్పడం సరికాదని అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే నీవు పార్టీ మారవని ఆరోపించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో బేరం కుదుర్చుకొని పార్టీ మారావ్ అని గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నీ విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. నేను గాని, గడ్డం నాగేష్ గాని, అణవేన మల్లేష్ కానీ మేము ఏ రోజు కూడా డబ్బులకు ఆశ పడలేదు ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు.. నువ్వు మా గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. పదవులను పట్టుకొని ఊగేసలాడే తత్వం నాది కాదని ఏఎంసీ డైరెక్టర్ పదవిని గడ్డి పూసతో సమానంగా విసిరి పారేశాను అని అన్నారు. ఇప్పటికైనా ఆరోపణలమాన్ని పెంచికలపేట గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పెంచికలపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుగురాల శేఖర్, గడ్డం నాగేష్ చొప్పరి మల్లేష్ మనోహర్, రంగం చంద్రయ్య, ఇరుగురాల లింగయ్య, దబ్బేట రాజు, వంగల విజయ్, పిడుగు విష్ణు, పిడుగు మనోహర్, పెంచికలపేట గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.