హోదా కోసం అసలైన పోరాటం వైకాపాదే

– రాజీనామాలు ఆమోదించమని స్పీకర్‌ను కోరతాం
– వైసీపీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి
ఒంగోలు, మే22(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పోరాటంలో వైకాపా కట్టుబడి ఉందని, హోదాకోసం అసలైన పోరాటం తమదేనని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే తమ పార్టీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారని తెలిపారు తమ రాజీనామాలను స్పీకర్‌ ఇంతవరకు అమోదించలేదన్నారు. అందుకే ఈ నెల 6న మరోసారి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు 29న రావాలని స్పీకర్‌ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఆరోజు జరిగే సమావేశంలో తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరతామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, ¬దా కోరుతూ తొలి నుంచి పోరాడుతున్నది వైకాపాయేనని.. ఇందులో భాగంగానే తమ పదవులకు త్యాగం చేసినట్లు ఎంపీ చెప్పారు. చంద్రబాబు ఇన్నాళ్లు ప్రత్యేక ¬దా దండగ అని ప్రస్తుతం మళ్లీ ప్రత్యేక ¬దా కావాలంటూ పట్టుపడుతున్నారని అన్నారు. మొదటి నుంచి చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని వైసీపీతో కలిసి పోరాడి ఉంటే ఇప్పటికే కేంద్రం ప్రత్యేక ¬దా ఇచ్చేందన్నారు. ఉద్యమం ఉగ్రరూపం దాల్చిన సమయంలో ప్రత్యేక ¬దా పాచిపోయిన లడ్డూఅంటూ చెప్పడం వల్ల ప్రజల్లో ఆశలు సన్నగిల్లాయని, అయినా వైసీపీ ప్రజల తరుపున పోరాటం సాగించిందన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర బాగోగులకంటే తన కుంటుంబం బాగోగులే ముఖ్యమని, తెదేపా పాలన అవిననీతి మయంగా మారిందన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఏపీకి అవినీతిలో దేశంలో 2వ స్థానం రావడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో అవినీతి స్థాయి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇసుక మాఫియా, మైనింగ్‌ మాఫియా ఇలా ప్రతి ఒక్కదానిలో తెదేపా నేతలు భాగస్వాములై అవినీతిని ప్రోత్సహించారన్నారు. ప్రజలు తెదేపాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వై.వి. సుబ్బారెడ్డి హెచ్చరించారు.