15న క్రీడా శిక్షణ శిబిరం ముగింపు
ఆదిలాబాద్,జూన్ 10 (జనంసాక్షి) :
ఆదిలాబాద్ లో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ముగింపుదశకు చేరుకున్నాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ఈనెల 15న ముగుస్తుంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అదే రోజు సాయంత్రం జరిగే సమావేశంలో సన్మానించాలని నిర్ణయించారు.
మరోవైపు వేసవిక్రీడాశిక్షణ శిబిరాల ముగింపు సందర్భంగా హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రధానం ఉంటుందని పేర్కొన్నారు.