9 లక్షలు దాటిన కరోనా కేసులు
– ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న మహమ్మారి
– మృతులు 45వేలకు పైనే
– భారత్ లో 1834కు చేరిన కరోనా కేసులు..మృతులు 41
– కరోనా వైరస్ 8 మీటర్ల దూరం ప్రయాణించగలదు
– తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి):కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 90,10,323 మంది దీని బారిన పడ్డారు. 45,496 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాధి నుంచి 1,90,901 మంది రోగులు కోలుకున్నారు. ఇక కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశాలైన ఇటలీలో ఒక్కరోజులోనే 727, స్పెయిన్ లో 589 మంది కన్నుమూశారు. ఇక యూకేలో ఒక్కరోజులోనే 563 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో 4,482 మంది, బ్రెజిల్ లో 206 మంది, ఇటలీలలో 13,155 మంది, స్పెయిన్లో 9,053 మంది, ఫ్రాన్లో 3,523 మంది, యూకేలో 3,523 మంది, నెదర్లాండ్లో 1173 మంది, జర్మనీలో 858 మంది, బెల్జియంలో 828 మంది, స్విట్జర్లాండ్లో 461 మంది, స్వీడన్లో 239 మంది, పోర్చుగల్ లో 187 మంది, చైనాలో 3,312 మంది, ఇరాన్లో 2,898 మంది, టర్కీలో 214 మంది, దక్షిణ కొరియాలో 165 మంది, ఇండోనేషియాలో 136 మంది చనిపోయారు. దేశంలో 1834కు చేరిన కరోనా కేసులు.. మృతులు 41 కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాణాంతక సూక్ష్మజీవి 203 దేశాలకు విస్తరించింది. ఇక భారత్ లో రోజు రోజుకూ దీని వ్యాప్తి ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1834 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం 1649 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 143 మంది డిశ్చార్చి అయ్యారు. మృతుల సంఖ్య 41 కి చేరింది. కరోనా వైరస్ 8 మీటర్ల దూరం ప్రయాణించగలదు సామాజిక దూరం పాటించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చేసిన సూచనలు కరోనా నియంత్రణకు సరిపడవంటూ తాజా అధ్యయనం కొత్త విషయాలను వెల్లడించింది. తుమ్మడం, దగ్గడం, చీచీజిదడం ద్వారా శరీరం నుంచి బయటకొచ్చే వైరస్… సుమారు 7-8 మీటర్ల వరకూ ప్రయాణించగలదని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలచీ జీజి పరిశోధకులు గుర్తించారు. ఈ మహమ్మారి గాలిలో గంటల తరబడి మనుగడ సాగిస్తోందని నిర్ధరణకు వచ్చారు. 1930 నాటి పద్ధతుల ద్వారా వైరస్ ప్రయాణించే పరిధిని డబ్ల్యూహెవో లెక్కగట్టింది. ఆ ప్రకారం… ఆరు అడుగుల దూరం పాటించడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని ప్రజలకు సూచించింది. ‘వైరస్లు ప్రయాణించే తీరు భిన్నంగా ఉంటోంది. దగ్గడం, చీదడం ద్వారా శరీరం నుంచి వెలువడే తుంపరలతో పాటే వైరస్ బయటకు వస్తుంది. అయితే ఇక్కడ రెండు అంశాలుంటాయి. 1) పెద్ద పరిమాణంలో ఉండే తుంపర. రోగులకు అత్యంత దగ్గర ఉండేవారికి వీటిలో ఉండే వైర’ ముప్పు ఉంటుంది. 2) చిన్న పరిమాణంలో ఉండే తేలికపాటి తుంపరలు గాలిలో సుమారు 23-27 అడుగులు (7-8 మీటర్ల దూరం ప్రయాణించి ఏదైనా ఉపరితలంపై నిలుస్తాయి. ఆ ప్రకారం చూస్తే, ఆరు అడుగుల దూరం కరోనా వైరస్ సోకకుండా అడ్డుకోలేదు” అని పరిశోధనకర్త లిడియా బోరిబా వివరించారు.