కరీంనగర్‌ను కాంగ్రెస్‌ హయాంలో..

బొందలగడ్డగా మార్చారు
– నాలుగేళ్లలో కరీంనగర్‌ను అభివృద్ధిపథంలో నడిపించాం
– కేటీఆర్‌ను విమర్శించే అర్హత పొన్నంకు లేదు
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌
హైదరాబాద్‌, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : కరీంనగర్‌ నగరాన్ని కాంగ్రెస్‌ నాయకులు బొందల గడ్డగా మార్చారని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, కరీంనగర్‌కు మంత్రి కేటీఆర్‌ అధిక నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కేటీఆర్‌ గురించి మాట్లాడే హక్కు పొన్నం ప్రభాకర్‌కు లేదని అన్నారు. పొన్నం ప్రభాకర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, జన్మనిచ్చిన గడ్డకు పొన్నం ద్రోహం చేయవద్దని కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌నుఅ న్ని రంగాల్లో అభివృద్ధిపరుస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇప్పటికే కోట్లాదినిధులు తెచ్చిజిల్లా అభివృద్ధి కృషి జరుగుతుందని అన్నారు. నాలుగేళ్లలో తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్‌ నేతలు పదేళ్ల కాలంలో చేయలేక పోయారని, పదేళ్ల కాలంలో కరీంనగర్‌ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. కరీంనగర్‌ అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. తద్వారా రాష్ట్రంనే కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయటం జరుగుతుందన్నారు. అభివృద్ధిని చూసి పొన్నం ప్రభాకర్‌ తట్టుకోలేక పోతున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మట్టికరుచుకుపోతుందనే భయంతో అసత్యాలను ప్రచారం చేసేందుకు తాపత్రయ పడుతున్నారని అన్నారు. ఇప్పటికైన పొన్నం తీరు మార్చుకోవాలని, లేకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారని కమలాకర్‌ హెచ్చరించారు.
———————————–