గంటా నాకంటే ముందే..  వైసీపీలో చేరాలని ప్రయత్నించారు

– నేను వైసీపీలో చేరడంతో వెనక్కి తగ్గారు
– వైసీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు
– వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌రావు
హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు నాకంటే ముందే వైసీపీలో చేరాలని ప్రయత్నించాడని, కానీ ఇప్పుడు నేను వైసీపీలో చేరడంతో వెనక్కు తగ్గాడని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  తన కన్నా ముందే వైసీపీలో చేరాలని గంటా ప్రయత్నించారని, తాను వైసీపీలో చేరడంతో ఆయన వెనక్కి తగ్గారని ఆరోపించారు. వైసీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ, తమ పార్టీలో ఖాళీలు మాత్రం లేవని వ్యాఖ్యానించారు. ఎవరి సామాజిక వర్గానికి చెందిన వారిపై ఆ సామాజిక వర్గం వారితో మాటల దాడి చేయించడం చంద్రబాబు ఆనందం అన్నారు.  ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా ఆయన్ని ప్రశ్నించకూడదని, దళితులు ప్రశ్నిస్తే దళితులతో, కాపులు ప్రశ్నిస్తే కాపులతోనే ఆయన తిట్టిస్తారని అవంతి మండిపడ్డారు.  ప్రజలకు వాస్తవం ఏంటో తెలుసని, ఆంధ్రా ప్రజలు చాలా తెలివైన వాళ్లని సమయం వచ్చినప్పుడు తీర్పును చాలా కరెక్టుగా ఇస్తారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు విధానాలు నచ్చక అధికార పార్టీని వీడామని, తమ స్వార్థం కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. మోసపూరి విధానాలతో
చంద్రబాబు పదేపదే ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కులాలను విభజించి తిట్టించడం ద్వారా చంద్రబాబు ఆనందం పొందుతారని విమర్శించారు. కులాల పేరుతో విమర్శించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. తాము అడిగిన దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక ¬దాపై ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారని ప్రశ్నించారు. చెప్పింది చేయడం చంద్రబాబుకు అలవాటు లేదన్నారు. తమపై విమర్శలు చేస్తే తిప్పికొడతామన్నారు. వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి ఒకేమాట విూద ఉన్నారని తెలిపారు. ప్రత్యేక ¬దా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారని శ్రీనివాసరావు అన్నారు.