గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం

భోజనంలో పోషకాలు ఉండేలా మార్పులు
ఐటిడిఎ విద్యాసంస్థల్లో మారిన మెనూ
హైదరాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి):  ఐటీడీఏ పరిధిలో ఉన్న  విద్యాసంస్థల్లో నాణ్యమైన భోజనం అందించేలా మెనూ అమల్లోకి వచ్చింది. పౌష్టికాహారం లక్ష్యంగా మెనూలో పదార్థాలు చేర్చారు. రోజుకో విధంగా పదార్థాలు చేర్చి వండి వడ్డిస్తున్నారు. దీంతో స్థానిక నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ విద్యాసంస్థల్లో ఆ తరహా మెనూ సిద్ధమైంది. వారానికి ఐదు కోడిగుడ్లు, ఐదు అరటిపండ్లు ప్రతీ మొదటి, మూడో, నాలుగో, ఐదో ఆదివారాల్లో చికెన్‌ కూరతో విద్యార్థులకు భోజనం వడ్డించనున్నారు. ప్రతీ రెండో ఆదివారం మటన్‌ కూరతో బిర్యానీ కూడా భుజించనున్నారు. ఈ అద్భుతమైన మెనూ గిరిజన సంక్షేమశాఖ రూపొందించింది. అన్ని ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో అమల్లోకి వచ్చింది.  ప్రతీ ఆదివారం ఉదయం7 గంటలకు పాలు, పంచదారతో రాగి జావ, 8 గంటలకు ఇడ్లీ, చట్నీ/ సాంబార్‌, మధ్యాహ్నం 12:30కి ప్రైడ్‌ రైస్‌, చికెన్‌ కూర, పెరుగు చట్నీ, సాంబారు, ప్రతీనెలా రెండో ఆదివారం మటన్‌ కూర, సాయంత్రం 4:45 నిమిషాలకు ఉడికించిన బొబ్బర్లు, 6:30 నిమిషాలకు రాత్రి భోజనంలో అన్నం, టమాట కూర, బెండకాయ, సాంబారు, మజ్జిగ, ప్రతీ సోమవారం ఉదయం పాలు, పంచదారతో రాగి జావ, అల్పాహారం, జీర అన్నం, అరటిపండు, మధ్యాహ్నం భోజనంలో అన్నం, వంకాయ కూర, ఆకు కూర పప్పు, సాంబారు, ఉడికించిన గుడ్లు, మజ్జిగ, సాయంత్రం ఉపాహారం కింద ఉడికించిన పెసలు, రాత్రి భోజనంలో అన్నం, దొండకాయ టమాటతో కూర, సాంబారు, మజ్జిగ, ప్రతీ మంగళవారం ఉదయం పాలు,
పంచదారతో రాగి జావ, అల్పాహారంలో సేమియా ఉప్మా, అరటిపండు, మధ్యాహ్నం భోజనంలో అన్నం, క్యాబేజీ టమాటతో కూర, ఆకుకూర పప్పు, సాంబార్‌, ఉడికించిన గుడ్లు, మజ్జిగ, ఉపాహారం కింద సాయంత్రం ఉడికించిన సెనగలు, రాత్రి భోజనం కింద అన్నం, బీరకాయ కూర, సాంబారు, మజ్జిగ, ప్రతీ బుధవారం పాలు, పంచదారతో రాగి జావ, అల్పాహారంలో టమాటా బాత్‌, చట్నీ, అరటిపండు, మధ్యాహ్న భోజనంలో అన్నం, కాకరకాయ టమాటతో కూర, ఆకుకూర పప్పు, సాంబారు, మజ్జిగ, ఉపాహారం కింద సాయంత్రం ఉడికించిన బొబ్బర్లు, రాత్రి భోజనంలో అన్నం, ఆలుగడ్డ, టమాటా కూర, సాంబారు, మజ్జిగ, ప్రతీ గురువారం ఉదయం పాలు పంచదారతో రాగిజావ, అల్పాహారం కిచిడీ, పెరుగు చట్నీ, అరటి పండు, మధ్యాహ్న భోజనంలో అన్నం, చిక్కుడుకాయ కూర, టమాటా, ఆకుకూర, పప్పు, సాంబారు, ఉడికించిన గుడ్డు, మజ్జిగ, సాయంత్రం పల్లీపట్టీ, రాత్రి భోజనం అన్నం, వంకాయ, టమాటతో కూర, సాంబారు, మజ్జిగ, ప్రతీ శుక్రవారం ఉదయం పాలు, పంచదారతో రాగి జావ, అల్పాహారం రైస్‌పొంగలి, అరటిపండు, మధ్యాహ్న భోజనంలో అన్నం, చేమదుంప, టమాటా కూర, ఆకు కూరతో పప్పు, సాంబార్‌, ఉడికించిన కోడిగుడ్లు, మజ్జిగ, ఉపాహారం ఉడికించిన బటానీ, రాత్రి భోజనంలో అన్నం, ములక్కాయ, టమాటాతో కూర, సాంబారు, మజ్జిగ, ప్రతీ శనివారం ఉదయం పాలు, పంచదారతో రాగి జావ, అల్పాహారంలో పులిహార, అరిపండ్లు, మధ్యాహ్న భోజనంలో అన్నం, బెండకాయ కూర, ఆకుకూర పప్పు, సాంబార్‌, మజ్జిగ, ఉపాహారం స్వీట్‌ , రాత్రి భోజనంలో అన్నం, ఆలుగడ్డ, టమాటాతో కూర, సాంబారు, మజ్జిగ మెనూగా ఉండబోతున్నాయి.