నకిలీ పత్రాలతో ..

బ్యాంకుల్లో రూ. కోట్లల్లో రుణాలు
– ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు
హైదరాబాద్‌, ఆగస్టు 18(జ‌నం సాక్షి) : భూములకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి ఆయా బ్యాంకుల్లో రూ. కోట్లల్లో రుణాలు పొందిన ముఠాను శనివారం రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆందుకు సంబంధించి రాచకొండ సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మురేళ్ల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితోపాటు పలువురు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారని, అనంతరం హైదరాబాద్‌లోని ఆయా ఏరియాల్లో తమకు భూములున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి తొలుత ఎల్‌ఐసీ సంస్థలో రూ. 40కోట్ల మేరకు రుణాలను తీసుకున్నారన్నారు. అనంతరం ఆయా బ్యాంకుల్లో మరో రూ. 30 కోట్ల రుణాలను పొందారని సీపీ తెలిపారు. కాగా… ఈ వ్యవహారం మొత్తం అధికారులు, లీగల్‌ అడ్వయిజర్ల సహకారంతోనే జరిగిందని సీపీ తెలిపారు. ఇప్పటికే ఈ ముఠాలో మొత్తం 50 మందిని గుర్తించామని, అందులో 10మందిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాన సూత్రదారి అయిన మురేళ్ల శ్రీనివాసరెడ్డిపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించామని కమిషనర్‌ తెలిపారు.